logo
Updated : 02/12/2021 08:22 IST

మాజీ ఎంపీ మాగుంట సుబ్బరామరెడ్డికి ఘన నివాళి


సుబ్బరామరెడ్డి చిత్రపటం వద్ద నివాళి అర్పిస్తున్న మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎంపీ మాగుంట

ఒంగోలు ట్రంకురోడ్డు, న్యూస్‌టుడే: మాజీ ఎంపీ మాగుంట సుబ్బరామరెడ్డికి ఆయన అభిమానులు, అనుచరులు నివాళి అర్పించారు. సుబ్బరామిరెడ్డి 26వ వర్ధంతి కార్యక్రమాలు ఒంగోలు నగరంలో బుధవారం నిర్వహించారు. రామ్‌నగర్‌లోని ఎంపీ మాగుంట కార్యాలయంలో చిత్రపటానికి ఎంపీ శ్రీనివాసులురెడ్డి, ఆయన తనయుడు రాఘవరెడ్డి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం అభిలాష్‌ సెంటర్‌, రైల్వేస్టేషన్‌రోడ్డు, అద్దంకి బస్టాండు సెంటర్లలోని మాగుంట విగ్రహాల వద్ద కార్యక్రమాలు జరిగాయి.. స్థానిక భాగ్యనగర్‌లో ఆతుకూరి బ్రహ్మయ్య, గాంధీరోడ్డులో తాతా ప్రసాద్‌, జయరామ్‌ సెంటర్‌లో పసుపులేటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు ఎంపీ హాజరయ్యారు. పీవీఆర్‌ బాలుర మున్సిపల్‌ ఉన్నత పాఠశాల మైదానంలో సర్వమత ప్రార్థనలతో పాటు కవితాగానం ఏర్పాటు చేశారు. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, జిల్లా ఎస్పీ మలికా గార్గ్‌, చీరాల, మార్కాపురం, సంతనూతలపాడు ఎమ్మెల్యేలు కరణం బలరామకృష్ణమూర్తి, కె.నాగార్జునరెడ్డి, టీజేఆర్‌ సుధాకర్‌బాబు, పీడీసీసీ బ్యాంకు ఛైర్మన్‌ మాదాసి వెంకయ్య, శాప్‌నెట్‌ ఛైర్మన్‌ బాచిన కృష్ణచైతన్య తదితరులు పాల్గొన్నారు.

Read latest Prakasam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని