logo
Published : 02/12/2021 05:36 IST

తెరవెనుకే అసలు అక్రమార్కులు

విద్యుత్తు వసూళ్లలో ఒకరిపై వేటుతో సరి

పెద్దరావీడు మండల ఏఈ కార్యాలయం

మార్కాపురం గడియార స్తంభం, పెద్దరావీడు న్యూస్‌టుడే: మార్కాపురం డివిజన్‌ విద్యుత్తు శాఖలో చోటు చేసుకున్న సిబ్బంది అక్రమాల వ్యవహారంలో అసలు వారు తెర వెనుకే ఉండిపోవడం అనుమానాలకు తావిస్తోంది. బుధవారం ఓ ఉద్యోగిపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఇటీవల గజ్జలకొండ పంచాయతీ, పెద్దరావీడు మండలం ప్రగళ్లపాడు గ్రామాల్లో రైతుల వద్ద నుంచి అక్రమ వసూళ్లు, అనధికారిక విద్యుత్తు లైన్ల ఏర్పాటు విషయంపై పత్రికల్లో వచ్చిన కథనాలపై ఉన్నతాధికారులు మార్కాపురం ఏడీఈని విచారణాధికారిగా నియమించారు. బాధిత రైతులు సదరు అధికారి నియామకంపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఒంగోలుకు చెందిన వ్యక్తిని విచారణాధికారిగా నియమించారు. అక్రమాలపై సీఎండీ సైతం స్పందించి పూర్తి స్థాయిలో విచారణ చేసి నవంబరు 15లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించారు. అనంతరం విచారణలో భాగంగా గజ్జలకొండ పంచాయతీ గ్రామాల్లో పర్యటించిన విజిలెన్స్‌ అధికారులు రైతుల వద్ద నుంచి వాంగ్మూలాలు సేకరించారు. తాజాగా చీరాలకు బదిలీ అయిన లైన్‌మెన్‌ను సస్పెండ్‌ చేస్తూ బుధవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. మిగిలిన వారిపై చర్యలు లేకపోవడంపై బాధితులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు అధికార పార్టీ యూనియన్‌లో బలమైన నాయకులుగా ఉండటంతోనే కీలక రాజకీయ నాయకుల ఒత్తిడి మేరకే చర్యల్లో జాప్యం జరుగుతోందన్న ప్రచారం జరుగుతోంది. నవంబరు 7న గజ్జలకొండలో వసూళ్లపై రైతులు సబ్‌స్టేషన్‌ను ముట్టడించడంతో వరుస అక్రమాలు వెలుగు చూశాయి. అధికారుల పాత్ర ఉన్నట్లు బాధిత రైతులు ఆరోపించినా కేవలం మెమోలు ఇచ్చి వదిలేయడం విమర్శలకు తావిస్తోంది.

Read latest Prakasam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని