logo

దేశ చరిత్రను కాపాడేది ఆచార్యులే

ప్రాచీన చరిత్రను కాపాడేందుకు ఆచార్యులంతా సమాయత్తం కావాలని ఆంధ్రప్రదేశ్‌ హిస్టరీ కాంగ్రెస్‌ పిలుపునిచ్చింది.

Published : 07 Aug 2023 02:38 IST

ఆంధ్రప్రదేశ్‌ హిస్టరీ కాంగ్రెస్‌ సర్వసభ్య సమావేశంలో వక్తలు

సమావేశానికి హాజరైన అధ్యాపకులు

కరెన్సీనగర్‌, న్యూస్‌టుడే: ప్రాచీన చరిత్రను కాపాడేందుకు ఆచార్యులంతా సమాయత్తం కావాలని ఆంధ్రప్రదేశ్‌ హిస్టరీ కాంగ్రెస్‌ పిలుపునిచ్చింది. ఏపీ హిస్టరీ కాంగ్రెస్‌ కార్యవర్గ నిర్వాహక కమిటీ సమావేశం ఆదివారం విజయవాడలోని ఆంధ్రా లయోల కళాశాల ఎస్‌జే బ్లాకులో నిర్వహించారు. కమిటీ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ మొవ్వా శ్రీనివాసులరెడ్డి, ఆచార్య కిరణ్‌ క్రాంత్‌ చౌదరి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రాచీన, మధ్య యుగ, ఆధునిక చరిత్రలను ఆయా ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయని, కొన్ని పాఠ్యాంశాలను తొలగించేందుకు సిద్ధపడుతున్నారని ఆరోపించారు. ఈ విషయాన్ని ఇప్పటికే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. వచ్చే ఏడాది జనవరిలో వార్షిక సమావేశాన్ని విశాఖపట్నం బుల్లయ్య కళాశాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. కొత్తగా నిర్వహించే సదస్సుకు అధ్యక్షునిగా గుంటూరు హిందూ కళాశాల విశ్రాంత అధ్యాపకులు ఎం.సోమశేఖర్‌ను ఎన్నుకున్నారు. మిగిలిన విభాగాలకు సంబంధించి నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి ఎస్‌.మురళి మోహన్‌ (ప్రాచీన చరిత్ర), కావలి జవహర్‌ భారతి డిగ్రీ కళాశాల నుంచి డాక్టర్‌ జె.కృష్ణ ప్రసాద్‌బాబు(మధ్యయుగ చరిత్ర), మైసూరు రీజనల్‌ విద్యా సంస్థ తరఫున ఆచార్య ఎస్‌.ఎస్‌.గాంధీ(ఆధునిక చరిత్ర), మౌలానా ఆజాద్‌ విశ్వవిద్యాలయం నుంచి ఆచార్య ఎస్‌.ఎన్‌.అజీజ్‌ హుస్సేన్‌ (చరిత్ర రచన) అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. సమావేశంలో చరిత్ర అధ్యాపకులు ఎ.రామచంద్రారెడ్డి, కొప్పర్థి వెంకట కృష్ణమూర్తి, కొల్లూరి సూర్యనారాయణ, గోవిందు సురేంద్ర, డాక్టర్‌ అజయ్‌బాబులు పాల్గొన్నారు. తొలుత ప్రిన్సిపల్‌ ఫాదర్‌ జి.ఎ.పి.కిషోర్‌, తెలుగు సీనియర్‌ అధ్యాపకులు ఆర్‌.రవీంద్ర భాస్‌లు సభ్యులను సమావేశానికి ఆహ్వానించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని