logo

Ongole: కార్యాలయ అధికారిక ఫేస్‌బుక్‌లో అశ్లీల చిత్రాలు

జిల్లా వైద్యఆరోగ్య శాఖ కార్యాలయానికి సంబంధించిన అధికారిక ఫేస్‌బుక్‌ తెరిచిన పలువురు అందులో కనిపించిన అశ్లీల చిత్రాలతో అవాక్కయ్యారు.

Updated : 13 Dec 2023 08:35 IST

 హ్యాక్‌ అయిందంటూ పోలీసులకు ఫిర్యాదు

 ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: జిల్లా వైద్యఆరోగ్య శాఖ కార్యాలయానికి సంబంధించిన అధికారిక ఫేస్‌బుక్‌ తెరిచిన పలువురు అందులో కనిపించిన అశ్లీల చిత్రాలతో అవాక్కయ్యారు. వైద్యశాఖ కార్యకలాపాలు, శిక్షణ వంటి అంశాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు పలువురికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఫేస్‌బుక్‌ నిర్వహిస్తున్నారు. ఆయా అంశాలను డీఎంహెచ్‌వో పేరుతోని ఫేస్‌బుక్‌ పేజీలో ఉంచుతున్నారు. నెల రోజుల క్రితం కూడా అశ్లీల చిత్రాలు కనిపించాయి. వాటిపై క్లిక్‌ చేస్తే రూ.5 వేలు బహుమతిగా ఇవ్వనున్నట్లు పేర్కొంటూ ట్యాగ్‌ కూడా చేశారు. ఈ విషయాన్ని గుర్తించిన కార్యాలయ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం కొద్దిరోజుల పాటు అందులో అశ్లీల చిత్రాలు ఉంచడం నిలిచిపోయింది. తాజాగా మంగళవారం మళ్లీ అటువంటి ఫొటోలు దర్శనమిచ్చాయి. ఈ విషయాన్ని డీఎంహెచ్‌వో రాజ్యలక్ష్మి మళ్లీ పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. డీఎంహెచ్‌వో కార్యాలయ ఫేస్‌బుక్‌ హ్యాక్‌ అయినందున ఎవరూ వినియోగించొద్దని ఈ సందర్భంగా ఆమె ఒక ప్రకటనలో కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని