logo

అక్రమ నియామకాలు.. అనుమతులు

డీఎంహెచ్‌వో డాక్టర్‌ ఎస్‌.రాజ్యలక్ష్మిపై వచ్చిన ఫిర్యాదులపై మంగళవారం విచారణకు నిర్ణయించారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ రీజినల్‌ డైరెక్టర్‌, విచారణ అధికారి పి.పద్మశశిధర్‌ వైద్యశాఖ కార్యాలయానికి సోమవారం సమాచారం పంపారు.

Published : 16 Apr 2024 03:50 IST

డీఎంహెచ్‌వోపై నేడు విచారణ

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: డీఎంహెచ్‌వో డాక్టర్‌ ఎస్‌.రాజ్యలక్ష్మిపై వచ్చిన ఫిర్యాదులపై మంగళవారం విచారణకు నిర్ణయించారు. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ రీజినల్‌ డైరెక్టర్‌, విచారణ అధికారి పి.పద్మశశిధర్‌ వైద్యశాఖ కార్యాలయానికి సోమవారం సమాచారం పంపారు. తగిన ఆధారాలతో విచారణ కమిటీ ఎదుట హాజరుకావాలని ఆమెను కోరారు. ఒంగోలు నగరంలో గత ఏడాది కొత్తగా ప్రారంభించిన ప్రైవేట్‌ నర్సింగ్‌ హోంలకు నిబంధనలకు విరుద్ధంగా లంచాలు తీసుకుని అనుమతులు ఇచ్చారని, ఫిజియోథెరపిస్టు, ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుల నియామకాల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయని పలువురు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అదే విధంగా కార్యాలయం సూపరింటెండెంట్‌ పయ్యావుల శ్రీనివాసరావుపై ఏసీబీ కేసులు పెండింగ్‌లో ఉన్నప్పటికీ నియామకాలకు సంబంధించిన కీలక బాధ్యతలు ఆయనకు అప్పగించారని అందులో పేర్కొన్నారు. వీటికి సంబంధించిన దస్త్రాలు విచారణ సమయంలో సమర్పించాలని డీఎంహెచ్‌ని విచారణాధికారి ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని