logo

నిలువునా ఎండిన ఉద్యాన తోటలు

చినుకు జాడ లేదు.. అడుగంటిన భూగర్భ జలం.. ఫలితంగా బోరు బావుల్లో నీళ్లు లేక ఉద్యాన తోటలు నిలువెల్లా ఎండిపోతున్నాయి. దీంతో రైతులు తీవ్ర నష్టాలు చవి చూస్తున్నారు.

Published : 01 May 2024 02:50 IST

తెదేపా హయాంలో ట్యాంకర్లతో నీళ్లు
త్రిపురాంతకం గ్రామీణం, న్యూస్‌టుడే

సోమేపల్లిలో కాపు దశలో ఎండిన నిమ్మతోట

చినుకు జాడ లేదు.. అడుగంటిన భూగర్భ జలం.. ఫలితంగా బోరు బావుల్లో నీళ్లు లేక ఉద్యాన తోటలు నిలువెల్లా ఎండిపోతున్నాయి. దీంతో రైతులు తీవ్ర నష్టాలు చవి చూస్తున్నారు. పశ్చిమ ప్రాంతంలోని కేశినేనిపల్లి, గొల్లవాండ్లపల్లి, దూపాడు, లేళ్లపల్లి, విశ్వనాధపురం, నడిగడ్డ, సోమేపల్లి, మేడపి తదితర గ్రామాల్లో వేలాది ఎకరాల్లో బత్తాయి, నిమ్మ, దానిమ్మ తోటలు సాగులో ఉన్నాయి. వాటిలో చాలా గ్రామాల్లోని బత్తాయి, నిమ్మ తోటలు కాపు దశలో ఉన్నాయి. తీవ్ర వర్షాభావంతో బోరు బావులు ఒట్టిపోతుండటంతో నీటి తడులు అందక కాపుతో ఉన్న తోటలు దెబ్బతింటున్నాయి. దీంతో రైతులు విలవిల్లాడుతున్నారు.

అప్పట్లో చురుగ్గా స్పందించి: గతంలో తెదేపా అధికారంలో ఉన్నప్పుడు కరవు సంభవించి బోరు బావులు ఎండిపోయి ఉద్యాన తోటలు ఎండుముఖం పట్టాయి. అప్పట్లో తెదేపా ప్రభుత్వం ట్యాంకర్లతో బత్తాయి, నిమ్మ తోటలకు నీటిని సరఫరా చేసి చెట్లను బతికించడంతో పంట ఉత్పత్తులు చేతికంది రైతులు ఎంతో ఆనందించారు. వారి పట్ల ప్రేమ ఒలకబోస్తున్న జగన్‌ ప్రభుత్వం ఎండిపోతున్న ఉద్యాన తోటలను కాపాడటంలో ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం పట్ల రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రూ.4లక్షలు నష్టపోయా.. : బోరు బావి కింద ఎకరాకు పైగా నిమ్మతోట వేశాను. తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో భూగర్భ జలాలు రావడం లేదు. నాటి అయిదేళ్లు కావడంతో ఏడాది కాపునకు వదిలాను. నీరు అందుబాటులో ఉంటే దాదాపు రూ.4లక్షలు వరకు పంట ఆదాయం లభించేది. తోట ఎండిపోవడంతో ఈ ఏడాది పంటతో పాటు 15 ఏళ్ల వరకు లభించే కాపు ఆదాయాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి దాపురించింది.

గుడిమెట్ల గాలెయ్య, సోమేపల్లి, త్రిపురాంతకం మండలం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని