logo

అధికారం ఉన్నోడిదే భూమి!

వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత పేదల ఆస్తులు, భూములకు రక్షణ లేకుండా పోయింది. రైతుల పట్టాదారు పాసుపుస్తకాలపై వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు- భూరక్ష పథకం అనే పట్టాదారు పుస్తకాలు జారీచేసి దానిపైన సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి పుస్తకాలను జారీచేశారు.

Published : 07 May 2024 02:48 IST

 కొత్త చట్టంతో రైతులకు చిక్కులు

వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత పేదల ఆస్తులు, భూములకు రక్షణ లేకుండా పోయింది. రైతుల పట్టాదారు పాసుపుస్తకాలపై వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు- భూరక్ష పథకం అనే పట్టాదారు పుస్తకాలు జారీచేసి దానిపైన సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి పుస్తకాలను జారీచేశారు. ఈ చట్టం వల్ల రైతులకు  భూమి మీదే... కానీ హక్కు ఉండదు. అధికారం ఉన్నోడి కన్ను పడితే అంతే సంగతి. అంతిమంగా సామాన్య, మధ్యతరగతి, చిన్న, సన్నకారు రైతుల భూములకు భద్రత లేకుండా పోతుంది. -న్యూస్‌టుడే, త్రిపురాంతకం గ్రామీణం, పొదిలి, యర్రగొండపాలెం పట్టణం

రక్షణ లేకుండా పోతుంది

వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం రైతుల భూములకు రక్షణ లేకుండా పోతుంది. ఈ చట్టం ద్వార మన భూముల రికార్డులు మారిపోయే ప్రమాదం ఉంది. వారసత్వ ఆస్తులను సైతం అధికారులు తేల్చడం ఏంటి. మన ఆస్తి వివాదాల్లో పడే అవకాశం ఉంది. 

బి.వెంకట్రావు, రైతు.

సీఎం బొమ్మ ఎందుకో

పూర్వీకుల నుంచి వారసత్వంగా వస్తున్న పట్టా భూముల పాసు పుస్తకాలపై సీఎం జగన్‌ బొమ్మ పెట్టుకోవడం దారుణం. గతంలో ఏ ప్రభుత్వం ఇలా వ్యవహరించ లేదు. ఈ విధంగా రైతుల పట్టాదారు పాసుపుస్తకాలపై బొమ్మలు పెట్టుకుని లాక్కోవడానికి ప్రభుత్వం ఏమైనా కుట్రలు చేస్తుందా?.

పెద్దపూడి అంజిరెడ్డి, రైతు, త్రిపురాంతకం

చట్టాన్ని రద్దు చేయాలి

ఇప్పటి వరకు గ్రామాల్లో స్వల్ప భూవివాదాలను కోర్టుల్లో పరిష్కరించుకుంటున్నారు. కొత్తగా వచ్చిన ఏపీ భూయాజమాన్య హక్కు చట్టం ద్వారా బాధితులు హైకోర్టును ఆశ్రయించాల్సి ఉంటుంది. టైటిల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారిగా అధికారులను నియమిస్తే చట్టం వారి చేతుల్లోకి వెళ్తుంది. అందువల్ల ఈ చట్టాన్ని రద్దు చేయాలి.

దేవినేని చలమయ్య,  ముడివేముల, త్రిపురాంతకం మండలం

తీవ్ర ఇబ్బందులు తప్పవు

ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్టుతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు వస్తాయి.  గతంలో ఎప్పుడూ ఇలాంటి చట్టాలు లేవు. పాసు పుస్తకాలపై జగన్‌మోహన్‌రెడ్డి చిత్రాలు వేయడం విచిత్రంగా ఉంది. ప్రజలు వారి ఆస్తులపై హక్కులు కోల్పోయే అవకాశం ఉంది. ఇలాంటి పనికిమాలిన చట్టాలను వెంటనే రద్దు చేయాలి.

 కొత్తపల్లి శ్రీనివాసులు, మాజీ సర్పంచి, కంభం

ఆక్రమణలకు అవకాశం ఇచ్చినట్లే .. రద్దు చేయాల్సిందే

రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమయింది. కొత్తకొత్త చట్టాలు తెచ్చి రైతులను ఇబ్బందులకు గురిజేస్తున్నారు.రైతుల భూములకు విలువ లేకుండా పోయింది. ఈ చట్టం భూ ఆక్రమణలకు అవకాశం ఇస్తుంది. భూములపై హక్కులను కాలరాసినట్లు ఉంటుంది. ఒక్క అవకాశం అని గద్దెనెక్కి అన్నం పెట్టే రైతుల ఉసురు పోసుకుంటున్నారు. ల్యాండ్‌ టైటిల్‌ యాక్ట్‌ రైతులకు ఉపయోగపడదు.

 బొడ్డు ఆంజనేయరెడ్డి, రైతు మురారిపల్లె

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని