logo

సికింద్రాబాద్‌ నుంచి ఏపీ, ఒడిశాలకు ప్రత్యేక రైళ్లు

సికింద్రాబాద్‌ నుంచి ఒడిశాలోని ఖుర్దారోడ్‌కు 2రోజులపాటు 2ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ నెల 10, 11 తేదీల్లో సాయంత్రం 4.30 గంటలకు ఇవి (07129, 07131) సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరతాయి.

Published : 09 May 2024 03:01 IST

ఈనాడు, హైదరాబాద్‌: సికింద్రాబాద్‌ నుంచి ఒడిశాలోని ఖుర్దారోడ్‌కు 2రోజులపాటు 2ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ నెల 10, 11 తేదీల్లో సాయంత్రం 4.30 గంటలకు ఇవి (07129, 07131) సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరతాయి. నల్గొండ, నడికుడి, పిడుగురాళ్ల, విజయవాడ, భీమవరం, రాజమండ్రి, విజయనగరం మీదుగా ప్రయాణిస్తాయి. 13న ఏపీ, ఒడిశాల్లో పోలింగ్‌ జరగనున్న నేపథ్యంలో ఆ రాష్ట్రాల ప్రయాణికుల్ని దృష్టిలో పెట్టుకుని రైల్వేశాఖ ఈ రైళ్లను ప్రకటించింది. 11, 12 తేదీల్లో ఖుర్దారోడ్‌ నుంచి ఈ రెండు రైళ్లు (07130, 07132) రాత్రి 10 గంటలకు తిరుగు ప్రయాణమై సికింద్రాబాద్‌కు చేరుకుంటాయి. సికింద్రాబాద్‌-నరసాపురం మధ్య ఈ నెల 10న ప్రత్యేక రైలు(07133) నడపనున్నట్లు ద.మ.రైల్వే తెలిపింది. శుక్రవారం రాత్రి 7.40కి సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరి నల్గొండ, సత్తెనపల్లి, గుంటూరు, గుడివాడ, భీమవరం, పాలకొల్లు మీదుగా నరసాపురం చేరుతుంది. 11న ఇదే దారిలో రైలు(07134) తిరుగు ప్రయాణమవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని