logo

సార్వత్రిక ఎన్నికలకు విస్తృత ఏర్పాట్లు

సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి పకడ్బందీ ఏర్పాట్లు, సమగ్ర పర్యవేక్షణ ఎంతో కీలకమని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ సూచించారు. స్థానిక ప్రకాశం భవన్‌ నుంచి జిల్లాలోని అన్ని నియోజకవర్గ ఆర్వోలు, ఏఆర్వోలు, ఎంపీడీవోలతో బుధవారం వీక్షణ సమావేశం నిర్వహించారు.

Published : 09 May 2024 03:18 IST

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి పకడ్బందీ ఏర్పాట్లు, సమగ్ర పర్యవేక్షణ ఎంతో కీలకమని కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ సూచించారు. స్థానిక ప్రకాశం భవన్‌ నుంచి జిల్లాలోని అన్ని నియోజకవర్గ ఆర్వోలు, ఏఆర్వోలు, ఎంపీడీవోలతో బుధవారం వీక్షణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలింగ్‌ కేంద్రాల్లోకి ఓటర్ల రాకపోకలను క్రమబద్ధీకరించేలా బారికేడ్లు, లైటింగ్‌, మైక్‌సిస్టమ్‌, ఒకటి కంటే ఎక్కువ పోలింగ్‌ కేంద్రాలుంటే ఓటర్లకు సహాయపడేలా సహాయ కేంద్రం, వైద్య శిబిరం, తాగునీరు, వాహనాలకు పార్కింగ్‌ సదుపాయం తదితర విషయాల్లో ఎలాంటి లోపం లేకుండా చూసుకోవాలని స్పష్టంచేశారు. పోలింగ్‌ రోజు అప్రమత్తంగా విధులు నిర్వహించాల్సి ఉన్నందున ముందురోజే సిబ్బంది చేరుకుంటారు, ఈ మేరకు తగిన వసతి, ఆహార సదుపాయాలు కల్పించడంపై దృష్టి పెట్టాలన్నారు. పోలింగ్‌ కేంద్రాల సమీపంలో ఇటుకలు, కర్రలు, భవన నిర్మాణాలకు వినియోగించే ఎలాంటి సామాగ్రి లేకుండా చూడాలని ఆదేశించారు. పోలింగ్‌ కేంద్రం, పరిసరాల మొత్తం కవర్‌ అయ్యేలా సీసీ టీవీలు ఏర్పాటు చేయడంలో ఎటువంటి నిర్లక్ష్యం ఉండకూడదని సూచించారు. ఎన్నికల ప్రచారం పూర్తయిన తర్వాత స్థానికేతరులెవరూ ఆయా ప్రాంతాల్లో ఉండకుండా చూడాలన్నారు. సమావేశంలో జేసీ రోణంకి గోపాలకృష్ణ, డీఆర్వో శ్రీలత, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని