logo
Published : 27/11/2021 05:38 IST

ఆశల గూడుకు ఆసరా ఏది..?

- ఈనాడు డిజిటల్‌, శ్రీకాకుళం, న్యూస్‌టుడే, రణస్థలం  

లావేరు గ్రామంలో నిలిచిన ఓ ఇంటి నిర్మాణం

నిరుపేదలకు సొంత గూడు కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా గృహ నిర్మాణ పథకాలు అమలు చేస్తున్నాయి. అర్హులకు ఇల్లు మంజూరు చేసి కేంద్రం రూ.1.5 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.50 వేలు సాయం అందిస్తున్నాయి. నిర్మాణం చేపట్టిన తర్వాత దశల వారీగా ఈ సాయం అందించాలి. అయితే ఏళ్లు గడుస్తున్నా బిల్లులు అందక జిల్లాలో అనేకమంది లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు.                            

ల్లు మంజూరైందన్న సంతోషంలో జిల్లా వ్యాప్తంగా చాలామంది నిర్మాణం ప్రారంభించారు. బిల్లులు రాకపోవడంతో మధ్యలోనే వదిలేశారు. కొందరు అప్పుచేసి మరీ ఇల్లు పూర్తి చేసుకుని గృహ ప్రవేశాలు చేశారు. ప్రభుత్వం సాయం చేస్తుందన్న ఆశతోనే అప్పు చేసి ఇల్లు నిర్మించుకున్నామని లబ్ధిదారులు చెబుతున్నారు. ఏళ్లుగా స్పందన లేకపోవడంతో చేసిన అప్పులు వడ్డీలతో కలిపి భారీగా పెరుగుతున్నాయని, ఎలా తీర్చాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి బిల్లుల మంజూరుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.


* ఈమె పేరు పందిరి లక్ష్మి. ఊరు రణస్థలం మండలంలోని సీతారాంపురం. మూడేళ్ల కిందట అప్పటి ప్రభుత్వం ఇల్లు మంజూరు చేయగా అప్పు చేసి నిర్మాణం పూర్తి చేశారు. ఇంతవరకూ ఎలాంటి సాయం అందలేదు.


ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి

తంలో మంజూరైన ఇళ్లకు బిల్లుల మంజూరు విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. అప్పట్లో లబ్ధిదారుల ఖాతాల్లో రూపాయి చొప్పున జమ చేయడం వాస్తవమే. సాయం కోసం లబ్ధిదారులు ఎదురు చూస్తున్న విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించాం. త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని వారు చెప్పారు. నిర్ణయం జరిగితే నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమవుతాయి.

- ఎన్‌.గణపతి, పీడీ, గృహనిర్మాణసంస్థ


అప్పుల పాలయ్యాను..: బిల్లు మంజూరవుతుందని అప్పు చేసి ఇల్లు కట్టాను. నాలుగేళ్లు గడిచినా బిల్లు రాలేదు. అప్పులకు వడ్డీలు చెల్లించలేకపోతున్నాను.

- గొర్లె రమణమ్మ, మీసాలబడి


పథకం  ఎన్టీఆర్‌ గృహకల్ప
ఏఏ సంవత్సరాల్లో  2016-17 నుంచి 2019-20
జిల్లాకు కేటాయించిన ఇళ్లు  53,335
పూర్తయినవి: 37,741
వివిధ దశల్లో ఉన్నవి: 11,621
ప్రారంభం కానివి: 3,973

Read latest Srikakulam News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని