logo

4 నుంచి పోస్టల్‌ బ్యాలెట్ వినియోగం

ఎన్నికల విధుల్లో భాగస్వామ్యమైన ఉద్యోగులు, సిబ్బంది పోస్టల్‌ బ్యాలెట్ వినియోగించుకునేందుకు అధికారులు అవకాశం కల్పించారు. గత ఎన్నికల్లో జిల్లా అంతటా ఒకే చోట పోస్టల్‌ బ్యాలెట్ను వినియోగించారు.

Published : 01 May 2024 06:41 IST

కలెక్టరేట్‌(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: ఎన్నికల విధుల్లో భాగస్వామ్యమైన ఉద్యోగులు, సిబ్బంది పోస్టల్‌ బ్యాలెట్ వినియోగించుకునేందుకు అధికారులు అవకాశం కల్పించారు. గత ఎన్నికల్లో జిల్లా అంతటా ఒకే చోట పోస్టల్‌ బ్యాలెట్ను వినియోగించారు. ఈసారి ఏ నియోజకవర్గ పరిధిలో వారికి అక్కడే ఓటు వేసేలా వెసులుబాటునిచ్చారు. 4న పీవో, ఏపీవో, సూక్ష్మ పరిశీలకులు, పోలీసు అధికారులు, కంట్రోల్‌ రూమ్‌ సిబ్బంది, తదితర శాఖలు, 5న ఓపీవో, సెక్టార్‌ అధికారులు, కంట్రోల్‌ రూమ్‌ సిబ్బంది, ఇతర బృందాల్లో విధులు నిర్వర్తిస్తున్నవారు, 6న పోలీసు సిబ్బంది, ప్రైవేటు డ్రైవర్లు, ఏపీఎస్‌ఆర్టీసీ, ఎన్నికల విధుల్లో ఉన్న వీడియో గ్రాఫర్లు, ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్‌, మాజీ సైనికులు, ఇతర జిల్లాల్లో ఓటు హక్కు కలిగి ఉన్న ఎన్నికల సిబ్బంది ఓటు వేయనున్నారు. 4, 5, 6 తేదీల్లో పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించుకోలేకపోయినవారికి 7న (రిజర్వ్‌డే) మరో అవకాశం ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 24,708 మంది పోస్టల్‌ బ్యాలెట్‌ను వినియోగించుకోనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని