logo

దువ్వాడకు ఓటేస్తే చెత్తబుట్టలో వేసినట్లే

ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు వచ్చే ఎన్నికల్లో ఓటేస్తే అది చెత్తబుట్టలో వేసినట్లేనని వైకాపా మండల మాజీ అధ్యక్షుడు, తెదేపా నేత బగాది హరి అన్నారు.

Published : 09 May 2024 04:26 IST

సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్న తెదేపా నేత హరి ప్రచారం

 ఉపాధి వేతనదారులతో మాట్లాడుతున్న బగాది హరి

టెక్కలి, న్యూస్‌టుడే: ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు వచ్చే ఎన్నికల్లో ఓటేస్తే అది చెత్తబుట్టలో వేసినట్లేనని వైకాపా మండల మాజీ అధ్యక్షుడు, తెదేపా నేత బగాది హరి అన్నారు. అయోధ్యపురం పంచాయతీ సర్పంచి ప్రతినిధిగా ఉన్న ఆయన స్థానికంగా ఉపాధి వేతనదారులతో బుధవారం మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. భార్యకు టికెట్‌ ఇస్తే దువ్వాడకు కోపమని అన్నారు. ఆయనకు 60 ఏళ్లు ఉండగా, 30 ఏళ్ల మహిళతో సంబంధం పెట్టుకుని భార్యపిల్లలను గాలికొదిలేసినట్లు ఆయన భార్యే ముఖ్యమంత్రి ఎదుట చెప్పిందన్నారు. కుటుంబాన్ని చూడనివారు ప్రజల్ని ఏం చూస్తారని వ్యాఖ్యానించారు. పలాసలో బొగ్గులు అమ్ముకునేవారని, సంపతిరావు రాఘవరావు అల్లుడిగానే టెక్కలికి పరిచయమయ్యాడని, ఆయన మారని పార్టీ లేదని నిప్పులు చెరిగారు. అయిదు సార్లు పోటీ చేసి ఓడిపోయాడని, ఇప్పుడు కూడా గెలవడని అన్నారు. దువ్వాడ ఎటువంటివాడో ఆయన భార్య, మామ, తమ్ముడి ఫోను నంబర్లు ఇస్తాను అడగండంటూ చెప్పారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని, అచ్చెన్నాయుడు హోం మంత్రి అవ్వడం ఖాయమని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని