logo

రాష్ట్రంలో బీఏ4 ఒమిక్రాన్‌ రకం గుర్తింపు

రాష్ట్రంలో బీఏ4 ఒమిక్రాన్‌ రకం కరోనాను గుర్తించినట్లు ఆరోగ్యశాఖ మంత్రి మా.సుబ్రమణియన్‌ తెలిపారు. చెన్నై గిండిలోని కింగ్స్‌ ఆస్పత్రిలో వృద్ధుల సంక్షేమ వైద్య కేంద్రాన్ని మంత్రి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ.

Published : 22 May 2022 04:43 IST

ఆరోగ్యశాఖ మంత్రి మా.సుబ్రమణియన్‌

విలేకరులతో మాట్లాడుతున్న మా.సుబ్రమణియన్‌

ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో బీఏ4 ఒమిక్రాన్‌ రకం కరోనాను గుర్తించినట్లు ఆరోగ్యశాఖ మంత్రి మా.సుబ్రమణియన్‌ తెలిపారు. చెన్నై గిండిలోని కింగ్స్‌ ఆస్పత్రిలో వృద్ధుల సంక్షేమ వైద్య కేంద్రాన్ని మంత్రి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ....కింగ్స్‌ ఇన్‌స్టిట్యూట్‌లో రూ.151.17కోట్ల ఖర్చుతో జాతీయ వృద్ధుల సంక్షేమ ఆస్పత్రి భవనాన్ని నిర్మించినట్లు తెలిపారు. కరోనా పెరిగితే 800 పడకలతో ప్రత్యేక ఆస్పత్రిగా మారుస్తామని చెప్పారు. వెయ్యి వైద్య ఉద్యోగాలు బదిలీలు జరగనున్నాయని చెప్పారు. నావలూర్‌లో ఒకే కుటుంబంలోని ఇద్దరికి కరోనా సోకిందని చెప్పారు. అందులో ఒకరికి ఒమిక్రాన్‌ బీఏ4 అనే కొత్తరకం ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. వాళ్లు ప్రస్తుతం క్షేమంగా ఉన్నారన్నారు. వారితో సంప్రదింపులు జరిపినవారికి పరీక్షించగా ఎవరికి వైరస్‌ లేదని తెలియవచ్చిందని పేర్కొన్నారు. బాధితులిద్దరు కోలుకుంటున్నారని చెప్పారు. జూన్‌ 12న లక్ష ప్రాంతాలలో మెగా టీకా శిబిరాలు జరగనున్నట్లు తెలిపారు. ఉక్రెయిన్‌ నుంచి వచ్చిన వైద్య విద్యార్థుల గురించి కేంద్రప్రభుత్వమే తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని