logo

ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌షిప్‌ సాధనే లక్ష్యం

క్యాండిడేట్‌ చెస్‌ ఛాంపియన్‌ టైటిల్‌ గెలిచి చెన్నై చేరుకున్న గుకేశ్‌కు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.

Updated : 26 Apr 2024 05:13 IST

క్యాండిడేట్‌ టైటిల్‌ విజేత గుకేశ్‌

విలేకర్లతో మాట్లాడుతున్న గుకేశ్‌

సైదాపేట, న్యూస్‌టుడే: క్యాండిడేట్‌ చెస్‌ ఛాంపియన్‌ టైటిల్‌ గెలిచి చెన్నై చేరుకున్న గుకేశ్‌కు విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌తో తలపడే క్రీడాకారుడిని ఎంపిక చేసేందుకు ఫిడే క్యాండిడేట్స్‌ 2024 అంతర్జాతీయ చెస్‌ పోటీ కెనడాలోని టొరెంటోలో జరిగింది. పాయింట్ల ప్రాతిపదికన ఛాంపియన్‌ టైటిల్‌ను తమిళ ఆటగాడు గుకేశ్‌ కైవసం చేసుకున్నాడు. పిన్న వయసులో (17) ఫిడే క్యాండిడేట్‌ చెస్‌ ఛాంపియన్‌ టైటిల్‌ సాధించిన ఆటగాడిగా గుకేశ్‌ రికార్డు సృష్టించాడు. కెనడా నుంచి చెన్నై చేరుకున్నాడు. ఇండియా చెస్‌ సమ్మేళనం, తమిళనాడు క్రీడాభివృద్ధి కమిషన్‌, పాఠశాల విద్యార్థులు మాలవేసి స్వాగతం పలికారు. గుకేశ్‌ విలేకర్లతో మాట్లాడుతూ... 7వ రౌండ్‌లో ఓడిపోవటం బాధించినా నమ్మకంతో ఆడానని చెప్పారు. తమిళనాడు ప్రభుత్వం జరిపిన చెన్నై గ్రాండ్‌ మాస్టర్‌ పోటీలో పాల్గొనేందుకు చివరి క్షణంలో అవకాశం వచ్చిందన్నాడు. తద్వారా క్యాండిడేట్‌ పోటీకి అర్హత సాధించేందుకు అవకాశం లభించిందన్నాడు. విశ్వనాథన్‌ ఆనందన్‌ తన రోల్‌ మోడల్‌ అని తెలిపాడు. ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌ టైటిల్‌ సాధించటమే లక్ష్యమని వివరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు