logo

నటుడు విజయ్‌ కుమారుడు కొత్త సినిమా.. హీరోగా కాదు!

నటుడు విజయ్‌ కుమారుడు జేసన్‌ సంజయ్‌ 2009లో విడుదలైన ‘వేట్టైక్కారన్‌’ చిత్రంలోని ‘నా అడిచ్చా తంగమాట్ట’ పాటలో తన డ్యాన్స్‌ ద్వారా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు.

Updated : 29 Mar 2024 09:53 IST

చెన్నై: నటుడు విజయ్‌ కుమారుడు జేసన్‌ సంజయ్‌ 2009లో విడుదలైన ‘వేట్టైక్కారన్‌’ చిత్రంలోని ‘నా అడిచ్చా తంగమాట్ట’ పాటలో తన డ్యాన్స్‌ ద్వారా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు. తర్వాత పైచదువులకు విదేశాలకు వెళ్లాడు. నటుడిగా పలు అవకాశాలు వెతుక్కుంటూ వచ్చినా దర్శకత్వంపై ఆసక్తితో వాటిని సున్నితంగా తిరస్కరించారు. కొన్ని డాక్యుమెంటరీలనూ తీశారు. లైకా ప్రొడక్షన్‌ నిర్మించే ఓ చిత్రానికి సంజయ్‌ దర్శకత్వం వహించడానికి ఒప్పందం కుదిరింది. నటీనటుల గురించి పలు వార్తలు వినిపిస్తున్నా ఇంకా ఖరారు కాలేదు. ఈ నేపథ్యంలో క్రికెట్‌ నేపథ్యంతో ఆ చిత్రం ఉంటుందనే వార్తలు కోలివుడ్‌లో వినిపిస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని