logo

బర్డ్‌ఫ్లూ నియంత్రణకు ప్రత్యేక బృందాలు

తమిళనాడులో బర్డ్‌ఫ్లూ వ్యాపించకుండా నియంత్రణ చర్యలు తీవ్రతరం చేశారు. కేరళ సరిహద్దు ప్రాంతాల్లో పశు సంరక్షణ వైద్యబృందం 24 గంటలూ పర్యవేక్షిస్తోంది.

Published : 25 Apr 2024 00:19 IST

వాహనాన్ని తనిఖీ చేస్తున్న బృందం సభ్యులు

విల్లివాక్కం, న్యూస్‌టుడే: తమిళనాడులో బర్డ్‌ఫ్లూ వ్యాపించకుండా నియంత్రణ చర్యలు తీవ్రతరం చేశారు. కేరళ సరిహద్దు ప్రాంతాల్లో పశు సంరక్షణ వైద్యబృందం 24 గంటలూ పర్యవేక్షిస్తోంది. కేరళ నుంచి కోళ్లు తీసుకొస్తున్న వాహనాలపై క్రిమినాశిని మందు పిచికారీ చేసిన అనంతరం అనుమతిస్తున్నారు. ఈరోడ్‌ జిల్లా పశువుల సంరక్షణశాఖ సంయుక్త సంచాలకుడు పళనివేల్‌ మాట్లాడుతూ.. బర్డ్‌ఫ్లూ కోళ్లు, బాతులు, టర్కీ, నీటి పక్షులు తదితరవాటికి సోకుతుందని చెప్పారు. హెచ్‌5ఎన్‌1 రకం వైరస్‌ బలమైనదన్నారు. ఈ వ్యాధికి చికిత్స లేదని నియంత్రణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఈరోడ్‌ జిల్లాలోని అన్ని కోళ్లఫాంలకు నేరుగా వెళ్లి నమూనాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. వెళ్ళోడు పక్షుల శరణాలయాన్ని రోజూ పర్యవేక్షించి బర్డ్‌ఫ్లూ లక్షణాలు తెలుసుకుంటున్నట్లు చెప్పారు. వ్యాధి నియంత్రణ చర్యలకు 50 ర్యాపిడ్‌ యాక్షన్‌ బృందాలను సిద్ధంగా ఉంచినట్లు పేర్కొన్నారు. కోళ్ల్లఫామ్‌ల యజమానులకు అవగాహన సమావేశాలు నిర్వహించినట్లు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని