logo

చేపలవేట నిషేధకాలంలో ఆర్థికసాయం పెంచాలి

చేపలవేట నిషేధ కాలంలో ఆర్థికసాయం పెంచి ఇవ్వాలని పుదుచ్చేరి అన్నాడీఎంకే కార్యదర్శి అన్బళగన్‌ కోరారు. శనివారం ముఖ్యమంత్రి రంగసామిని కలిసి వినతిపత్రం అందించారు.

Published : 05 May 2024 00:08 IST

పుదువై సీఎంకు అన్నాడీఎంకే వినతి

 రంగసామికి వినతిపత్రం అందిస్తున్న అన్బళగన్‌

ఆర్కేనగర్‌, న్యూస్‌టుడే: చేపలవేట నిషేధ కాలంలో ఆర్థికసాయం పెంచి ఇవ్వాలని పుదుచ్చేరి అన్నాడీఎంకే కార్యదర్శి అన్బళగన్‌ కోరారు. శనివారం ముఖ్యమంత్రి రంగసామిని కలిసి వినతిపత్రం అందించారు. తమిళనాట అన్నాడీఎంకే పాలనలో చేపలవేట నిషేధకాలంలో రూ.8వేలు, వర్షాకాలంలో ఆర్థికసాయంగా రూ.6వేలు మత్స్యకారులకు అందించిందన్నారు. పుదుచ్చేరి ప్రభుత్వం రూ.6,500, రూ.3 వేలు ఇస్తోందన్నారు. దిగువస్థాయి కార్మికులకు రూ.320 దినకూలీ ఇవ్వాలని కేంద్ర ఉత్తర్వు ఉందన్నారు. అందులో భాగంగా చేపలవేట నిషేధ కాలానికి 61 రోజులకు రూ.19,520 పరిహారంగా ప్రభుత్వ ఇవ్వాలన్నారు. కేంద్రం ఇస్తున్న నిధుల్లో మూడోవంతు కూడా ఆర్థికసాయంగా ఇవ్వకపోవడం సరికాదన్నారు. నిషేధకాలానికి రూ.10వేలు, వర్షాకాలంలో రూ.6 వేలు ఈ ఏడాది నుంచే ఇవ్వాలని విన్నవించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని