logo

ప్రదీప్‌ రంగనాథన్‌ చిత్రానికి డ్రాగన్‌గా టైటిల్‌

అశ్వత్‌ మారిముత్తు దర్శకత్వంలో ప్రదీప్‌ రంగనాథన్‌ హీరోగా నటించనున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియోను ఏజీఎస్‌ సంస్థ గత నెల యూట్యూబ్‌లో విడుదల చేసింది.

Published : 06 May 2024 01:31 IST

సినిమా పోస్టర్‌

చెన్నై: అశ్వత్‌ మారిముత్తు దర్శకత్వంలో ప్రదీప్‌ రంగనాథన్‌ హీరోగా నటించనున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియోను ఏజీఎస్‌ సంస్థ గత నెల యూట్యూబ్‌లో విడుదల చేసింది. ఈ నేపథ్యంలో చిత్రం టైటిల్‌ను ‘డ్రాగన్‌’గా చిత్రబృందం విడుదల చేసింది.


50 మిలియన్‌ వ్యూస్‌ దాటిన విజిల్‌ పోడు

వ్యూస్‌ పోస్టర్‌

చెన్నై, న్యూస్‌టుడే: వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో విజయ్‌ నటిస్తున్న ‘గోట్‌’ చిత్రం సెప్టెంబరు 5న విడుదల కానున్న విషయం తెలిసిందే. చిత్రంలోని ‘విజిల్‌ పోడు’ పాట లిరిక్‌ వీడియో తమిళ సంవత్సరాది రోజు విడుదలై యూట్యూబ్‌లో 24 గంటల్లో 25.5 మిలియన్‌ వ్యూస్‌ దాటింది. తమిళ సినిమాల్లో 24 గంటల్లోపు అత్యధిక వీక్షణలు పొందిన పాటగా ‘బీస్ట్‌’లోని ‘అరబిక్‌ కుత్తు’ పాట రికార్డు సాధించగా దానిని ‘విజిల్‌ పోడు’ బద్దలుకొట్టింది. ప్రస్తుతం 50 మిలియన్‌ వీక్షణలు దాటింది. దక్షిణాది సినిమా పాటకు ఇన్ని వ్యూస్‌ రావడం ఇదే మొదటిసారి. చిత్ర నిర్మాత అర్చనా కల్పాత్తి తన ఎక్స్‌ పేజీలో ఆనందం వ్యక్తం చేశారు.


జలవనరులను కలుషితం చేయొద్దు: నటి రెజీనా

చెన్నై: జలవనరులను కలుషితం చేయొద్దంటూ నటి రెజీనా పిలుపునిచ్చారు. ఎస్‌యూపీ మెరినా క్లబ్‌ బృందంతో కలిసి బీచ్‌ శుభ్రతా పనుల్లో రెజీనా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఎస్‌యూపీ మెరినా క్లబ్‌ బృందాన్ని నడిపించే 12 ఏళ్ల అనిశ్‌ ఆహ్వానం మేరకు శుభ్రతా పనుల్లో పాల్గొన్నానని తెలిపారు. బీచ్‌, జలవనరులను చెత్తతో నింపకూడదని హితవు పలికారు. పర్యావరణం నుంచి ప్లాస్టిక్‌, ఇతర వ్యర్థాలను తొలగించాలని తెలిపారు. జలవనరులు అందరికీ అత్యవసరమని, వాటిని కలుషితం చేయొద్దని పేర్కొన్నారు.


మాట్రం ఫౌండేషన్‌కు రజనీ అభినందనలు

చెన్నై: నటుడు, నృత్యదర్శకుడు రాఘవ లారెన్స్‌ ఈ నెల 1న ‘మాట్రం’ ఫౌండేషన్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. దీని ద్వారా వాలంటీర్లతో ప్రజలకు సాయమందిస్తున్నారు. తొలి విడతగా రైతులకు ఉపయోగపడేలా 10 గ్రామాలకు 10 ట్రాక్టర్లను అందించనున్నారు. ఈ నేపథ్యంలో ‘మాట్రం’ ప్రారంభించిన రాఘవ లారెన్స్‌కు నటుడు రజనీకాంత్‌ శుభాకాంక్షలు తెలిపారు. ‘మాట్రం’ ద్వారా ఇంకా వేలాది మంది పేదలకు సాయం అందించాలని ఆకాంక్షించారు.


పాట, సంగీతం నిర్మాతకే సొంతం: రాజన్‌

క్లాప్‌ కొడుతున్న రాజన్‌

చెన్నై: శ్రీసాయి సైందవి క్రియేషన్స్‌ పతాకంపై పాండురంగన్‌ నిర్మాణంలో గజేంద్ర దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘కుట్రం తవిర్‌’. ఇందులో రిషి రిత్విక్‌, ఆరాధ్య, చిత్తప్పు శరవణన్‌, సెన్‌రాయన్‌, వినోదిని తదితరులు నటిస్తున్నారు. చిత్ర ప్రారంభోత్సవం నగరంలోని ప్రసాద్‌ ల్యాబ్‌లోని వినాయకుడి ఆలయంలో పూజతో జరిగింది. నిర్మాతలు, పంపిణీదారుల సంఘం అధ్యక్షుడైన కె.రాజన్‌ మాట్లాడుతూ... ఒక చిత్రం పాట హక్కు నిర్మాతకే చెందుతోందని తెలిపారు. ఇల్లు కట్టినందుకు ఆ ఇల్లు తనకే సొంతమని తాపీ మేస్త్రీ చెప్పడం ఎంత మూర్ఖత్వమో సంగీతం కూడా సంగీత దర్శకుడికే సొంతమని చెప్పడం కూడా అంతేనని పేర్కొన్నారు. ఇళయరాజా సంగీత మేథావి అని చెప్పడంలో ఎలాంటి అనుమానం లేదన్నారు. అయితే ఆయన పాటకు హక్కు కోరడం సరికాదని తెలిపారు. ఈ వ్యవహారానికి సంబంధించిన కోర్టు తీర్పు నిర్మాతలకు అనుకూలంగా వస్తుందని నమ్ముతున్నట్టు ఆశాభావం వ్యక్తం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని