logo

‘విలేజ్‌ కుకింగ్‌’ తాత ఆరోగ్యంపై రాహుల్‌గాంధీ ఆరా

విలేజ్‌ కుకింగ్‌ యూట్యూబ్‌ ఛానల్‌ తాత పెరియతంబి ఆరోగ్యంపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆరా తీసినట్లు సమాచారం. విలేజ్‌ కుకింగ్‌ ఛానల్‌కు 22 మిలియన్‌ చందాదారులు ఉన్నారు.

Published : 06 May 2024 06:06 IST

సైదాపేట, న్యూస్‌టుడే: విలేజ్‌ కుకింగ్‌ యూట్యూబ్‌ ఛానల్‌ తాత పెరియతంబి ఆరోగ్యంపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఆరా తీసినట్లు సమాచారం. విలేజ్‌ కుకింగ్‌ ఛానల్‌కు 22 మిలియన్‌ చందాదారులు ఉన్నారు. 2018లో ఈ ఛానల్‌ను సుబ్రమణియన్‌, మురుగేశన్‌, అయ్యనార్‌, తమిళ్‌సెల్వన్‌, ముత్తుమాణిక్కం, పెరియతంబి ప్రారంభించారు. ఈ బృందాన్ని పెరియతంబి నడిపిస్తున్నారు. ప్రకృతి అందంతో కూడిన ప్రాంతాల్లో వంట చేయటంతో ఈ ఛానల్‌ జనాలను విపరీతంగా ఆకట్టుకుంది. తమిళనాడుకు వచ్చిన రాహుల్‌గాంధీ వారి వంటకాలను రుచి చూసి అభినందించారు. కమల్‌హాసన్‌ నటించిన విక్రమ్‌ సినిమాలోని ఒక సన్నివేశంలో ఈ బృందం కనిపించటంతో మరింత ఆదరణ పెరిగింది. ఈ ఏడాది మార్చిలో పెరియతంబి గుండె జబ్బుతో ఆస్పత్రిలో చేరారు. ప్రస్తుతం కోలుకుని బాగున్నట్లు ఆ బృందానికి చెందిన సుబ్రమణియన్‌ ఎక్స్‌ పేజీలో పోస్టు చేశాడు. పెరియతంబి విడుదల చేసిన వీడియోలో.. తాను ఆస్పత్రిలో ఉన్నప్పుడు పరామర్శించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా తమ్ముడు రాహుల్‌గాంధీ ఫోన్‌లో తనను సంప్రదించి ఆరోగ్యంపై ఆరా తీశారన్నారు. పూర్తిగా కోలుకుని వస్తానని ధైర్యం చెప్పారని గుర్తు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని