logo

మాజీ ఎమ్మెల్యే వేలాయుధన్‌ కన్నుమూత

తమిళనాడు భాజపా ఎమ్మెల్యే వేలాయుధన్‌(73) మృతి చెందారు. 1996 శాసనసభ ఎన్నికల్లో భాజపా తరఫున రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులు పోటీచేశారు. కన్నియాకుమరి జిల్లా పద్మనాభపురం నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన వేలాయుధన్‌ గెలుపొందారు.

Published : 09 May 2024 00:51 IST

ప్యారిస్‌, న్యూస్‌టుడే: తమిళనాడు భాజపా ఎమ్మెల్యే వేలాయుధన్‌(73) మృతి చెందారు. 1996 శాసనసభ ఎన్నికల్లో భాజపా తరఫున రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులు పోటీచేశారు. కన్నియాకుమరి జిల్లా పద్మనాభపురం నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన వేలాయుధన్‌ గెలుపొందారు. భాజపా తరఫున మొట్టమొదటి సారి శాసనసభకు ఎన్నికయ్యారు. 2001, 2006లో పోటీ చేసినా విజయం వరించలేదు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు వహించిన ఆయన 2006 తర్వాత రాజకీయాల నుంచి తప్పుకొని ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రామాలయ నిర్మాణానికి సంతకాల ఉద్యమం నిర్వహించారు. కొద్ది నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బుధవారం ఉదయం మృతిచెందారు. పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. సొంతూరైన కరుప్పుక్కోడులో గురువారం అంత్యక్రియలు జరగనున్నాయి. ఆయనకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. భార్య కొన్నేళ్ల కిందట మృతి చెందింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని