logo

జీవీఎంసీ అధికారుల్లో.. స్పందన రాహిత్యం

స్పందన అర్జీల పరిష్కారంలో అలసత్వం వహిస్తే సహించేది లేదని జిల్లా కలెక్టర్‌ ఎ.మల్లికార్జున మరోసారి స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో ఆయన స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా నలుమూలల

Published : 24 May 2022 05:37 IST

కలెక్టర్‌ మల్లికార్జున ఆగ్రహం

స్పందనలో వినతులు స్వీకరిస్తున్న కలెక్టర్‌ ఎ.మల్లికార్జున, జేసీ విశ్వనాథన్‌, డీఆర్వో శ్రీనివాసమూర్తి తదితరులు

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: స్పందన అర్జీల పరిష్కారంలో అలసత్వం వహిస్తే సహించేది లేదని జిల్లా కలెక్టర్‌ ఎ.మల్లికార్జున మరోసారి స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో ఆయన స్పందన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 185 మంది నుంచి అర్జీలు స్వీకరించారు. అనంతరం జిల్లా అధికారులతో వివిధ అంశాలపై సమీక్షించారు. అర్జీల పరిష్కారంలో జీవీఎంసీ అధికారుల తీరు మారాలని, కొన్నింటిని సత్వరం పరిష్కరించడం లేదన్నారు. దీంతో వినతుల పరిష్కారంలో జిల్లా వెనుకబడి ఉందన్నారు. ఎన్నిసార్లు చెబుతున్నా పట్టించుకోవడం లేదని, ఇక మీదట చర్యలు తప్పబోవని హెచ్చరించారు. ఏపీ సేవా పోర్టల్‌ యాప్‌ ద్వారా సచివాలయాల్లో వినతులు స్వీకరించాలని, కొన్ని సచివాలయాల్లో అర్జీలు ఎందుకు తక్కువ వస్తున్నాయో జీవీఎంసీ అధికారులు పరిశీలన చేయాలన్నారు. పెండింగ్‌లో ఉన్న జగనన్న తోడు, విద్యా దీవెన వంటి ప్రభుత్వ పథకాలు లబ్ధిదారులకు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. విద్యుత్తు మీటర్లకు ఆధార్‌ అనుసంధాన ప్రక్రియ వెంటనే పూర్తి చేయడంతోపాటు వాలంటీర్ల ఖాళీ పోస్టులను సత్వరమే భర్తీ చేయాలన్నారు. జేసీ కె.ఎస్‌. విశ్వనాథన్‌, డీఆర్వో శ్రీనివాసమూర్తి, ప్రత్యేక ఉప కలెక్టర్‌ రంగయ్య, ఏసీపీ బాబూజీ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని