logo

సూపర్‌ సిక్స్‌... బంపర్‌ హిట్‌ : గణబాబు

తెదేపా ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ పథకాలు బంపర్‌ హిట్‌ అని, వైకాపా మ్యానిఫెస్టో అట్టర్‌ ఫ్లాప్‌ అని పశ్చిమ ఎమ్మెల్యే పి.గణబాబు అభిప్రాయపడ్డారు.

Published : 01 May 2024 03:22 IST

ఎన్‌ఏడీకూడలి, న్యూస్‌టుడే : తెదేపా ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ పథకాలు బంపర్‌ హిట్‌ అని, వైకాపా మ్యానిఫెస్టో అట్టర్‌ ఫ్లాప్‌ అని పశ్చిమ ఎమ్మెల్యే పి.గణబాబు అభిప్రాయపడ్డారు. మంగళవారం ఆయన 91వ వార్డు ఎస్సీకాలనీ, బాజీకూడలి, బుచ్చిరాజుపాలెంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గత ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి విఫలమయ్యారని, తెదేపా కూటమి అధికారంలోకి రాగానే అందరికీ న్యాయం చేస్తామన్నారు. అనంతరం ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు. ఎన్నికల్లో సైకిల్‌ గుర్తుపై ఓటేసి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా శ్రీభరత్‌ను గెలిపించాలని ప్రజల్ని కోరారు. 90వ వార్డు కార్పొరేటర్‌ బొమ్మిడి రమణ, కూటమి నాయకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని