logo

ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా అందజేస్తామని పెందుర్తి నియోజకవర్గం జనసేన అభ్యర్థి పంచకర్ల రమేశ్‌బాబు అన్నారు.

Published : 07 May 2024 04:23 IST

కార్మికులతో మాట్లాడుతున్న పంచకర్ల రమేశ్‌బాబు

సుజాతనగర్‌(పెందుర్తి), న్యూస్‌టుడే: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల ఆరోగ్య బీమా అందజేస్తామని పెందుర్తి నియోజకవర్గం జనసేన అభ్యర్థి పంచకర్ల రమేశ్‌బాబు అన్నారు. జీవీఎంసీ 97వ వార్డు పరిధి సుజాతనగర్‌ దరి కార్మికనగర్‌లో సోమవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆరోగ్యం పేదలకు భారం కాకూడదన్న లక్ష్యంతో తెదేపా, జనసేన అధినేతలు ఆలోచన చేసి ఆరోగ్య బీమాను అమలు చేయబోతున్నారన్నారు. వార్డు తెదేపా నాయకులు శానాపతి శంకర్రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నాయకులు శానాపతి సోమశేఖర్‌నాయుడు, పి.కిశోర్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

‘నియంతలా ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌’

సబ్బవరం, న్యూస్‌టుడే: వైకాపా ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్‌రాజ్‌ ఒక నియంతలా మారిపోయి అందరినీ శాసిస్తున్నాడని పంచకర్ల రమేశ్‌బాబు ఆరోపించారు. సబ్బవరం మండలం చినపబంగారమ్మపాలెం, బంగారమ్మపాలెం, చినయాతపాలెం, పెదయాతపాలెం, ఆరిపాక గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. నియోజకవర్గంలోని ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో తన సొంత మనుషులను పెట్టుకుని దందాలకు పాల్పడుతూ రూ.వందల కోట్లు కూడ బెట్టుకున్నారని విమర్శించారు. పెందుర్తి తెదేపా ఇన్‌ఛార్జి గండి బాబ్జీ, కూటమి నేతలు ఇందల రమణ, డి.సూర్యప్రకాశరావు, దాడి కన్నంనాయుడు, శరగడం రాము, ఝాన్సీ, ఆడారి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

జనసేనలోకి చేరిన వారితో పంచకర్ల రమేశ్‌బాబు

గుల్లేపల్లికి చెందిన వైకాపా నేత బి.సన్యాసిరావు ఆధ్యర్యంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పలువురు జనసేనలో చేరారు. ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేశ్‌బాబు వారికి కండువాలు వేసి జనసేనలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇటీవల పాముకాటుకు గురైన అండబోయిన గణేశ్‌కు గండి వంశీ వైద్యం నిమిత్తం రూ.5వేలు వితరణగా అందించారు. కూటమి నేతలు భర్నికాన సాయినాథరావు, అండబోయిన బంగారయ్య, పలువురు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.

రూ.4 వేలకు పింఛన్‌ పెంపు

లంకెలపాలెంలో ప్రచారం చేస్తున్న కార్పొరేటర్‌ రౌతు శ్రీనివాసరావు, కూటమి నాయకులు

లంకెలపాలెం(పరవాడ), న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.4 వేలకు పెంచుతామని, దీన్ని ఏప్రిల్‌ నుంచే వర్తింపజేస్తామని జీవీఎంసీ 79వ వార్డు కార్పొరేటర్‌ రౌతు శ్రీనివాసరావు అన్నారు. పెందుర్తి అభ్యర్థి పంచకర్ల రమేశ్‌బాబు, అనకాపల్లి పార్లమెంట్‌ భాజపా అభ్యర్థి సీఎం రమేశ్‌కు మద్దతుగా సోమవారం రాత్రి కూటమి నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. బీసీలకు 50 ఏళ్లకే పింఛన్‌ అందిస్తామని, దివ్యాంగులకు రూ.6 వేలు, నిరుద్యోగ భృతి, యువతకు 20 లక్షలు ఉద్యోగాలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు చలపరెడ్డి రామారావు, సర్వసిద్ధి సన్యాసిరావు, సుందరపు శ్రీనివాస్‌, బొడ్డపల్లి అప్పారావు, జెర్రిపోతుల అప్పారావు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని