logo

సైబర్‌ పరిశోధన ప్రయోగశాల ప్రారంభం

విశాఖ పోర్టు ట్రస్టు సీఎస్‌ఆర్‌ నిధులతో పోలీసు కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన సైబర్‌ పరిశోధన ప్రయోగశాల(సైబర్‌ ఇన్వెస్టిగేషన్‌ ల్యాబ్‌)ను పోరు ట్రస్టు ఛైర్మన్‌ డాక్టర్‌ అంగముత్తు బుధవారం ప్రారంభించారు.

Published : 09 May 2024 04:16 IST

ఎం.వి.పి.కాలనీ, న్యూస్‌టుడే : విశాఖ పోర్టు ట్రస్టు సీఎస్‌ఆర్‌ నిధులతో పోలీసు కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన సైబర్‌ పరిశోధన ప్రయోగశాల(సైబర్‌ ఇన్వెస్టిగేషన్‌ ల్యాబ్‌)ను పోరు ట్రస్టు ఛైర్మన్‌ డాక్టర్‌ అంగముత్తు బుధవారం ప్రారంభించారు. సి.పి. రవిశంకర్‌ అత్యాధునిక సాంకేతికను వినియోగిస్తూ నగర శాంతిభద్రతల పర్యవేక్షిస్తున్న తీరును ప్రత్యక్షంగా వివరించారు. సీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎగైల్‌ యాప్‌ వినియోగం గురించి తెలియజేశారు. సీపీ మాట్లాడుతూ.. మోసాల బారిన పడి నష్టపోయిన వారి నగదు రికవరీ చేయటానికి ఈ ల్యాబ్‌ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని