logo
Published : 29/11/2021 05:21 IST

అన్నీ ఉన్నా.. ప్రయోగం లేదండి

పాచిపెంట ఆశ్రమ పాఠశాలలో తరగతి గదిలోనే పరికరాలు ఉంచారు.

ఇక్కడ కొన్ని రసాయనాలు కూడా ఉండడంతో విద్యార్థులు భయాందోళన చెందుతున్నారు.

గుమ్మలక్ష్మీపురం, జియ్యమ్మవలస, పాచిపెంట, పార్వతీపురం గ్రామీణం, కొమరాడ, న్యూస్‌టుడే: గిరిజన పాఠశాలల్లో ప్రయోగాత్మక బోధనలు కానరావడం లేదు. దీంతో విద్యార్థులు వైజ్ఞానిక ప్రదర్శనల్లో వెనకబడుతున్నారు. పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని 55 గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో 13,500 మంది చదువుతున్నారు. వీరిలో 6 నుంచి 10 తరగతుల వరకు సుమారు 9,500 మంది ఉన్నారు. వీరందరికీ పాఠ్యాంశాల బోధనతో పాటు ప్రయోగ పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. పలుచోట్ల చాలీచాలని పరికరాలు ఉండడం, కొన్నిచోట్ల అందుబాటులో ఉన్నా గదులు, సంబంధిత ఉపాధ్యాయులు లేక ఉపయోగించడం లేదు.

నిధులు వృథా..

రసాయనికశాస్త్రం ప్రయోగ పరీక్షలు నిర్వహించేందుకు 26 ఉన్నత పాఠశాలలకు మూడేళ్ల కిందట ప్రత్యేక టేబుళ్లు ఇచ్చారు. ఒక్కో బల్ల ధర రూ.25,800 కాగా మొత్తం రూ.6.70 లక్షలు వెచ్చించారు. నిర్వహణ లేమితో ప్రస్తుతం ఇవన్నీ నిరుపయోగంగా పడిఉన్నాయి.

ఒకే గదిలో..

జియ్యమ్మవలస, కొమరాడ, పాచిపెంట తదితర పాఠశాలల్లో గదులు లేక విద్యార్థులున్న చోటే పరికరాలు ఏర్పాటు చేశారు. దీంతో కొన్నిసార్లు బోధనకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పాచిపెంట బాలికల ఆశ్రమ పాఠశాలలో బీరువాలు కూడా లేకపోవడంతో ఆరుబయటే పెట్టేశారు. పార్వతీపురం మండలం డోకిశీలలో ఏడాదిగా జీవ, రసాయనశాస్త్ర ఉపాధ్యాయులు లేక పరికరాలు మూలకు చేరాయి.

ప్రతిపాదనలు పంపించాం..

నాడు-నేడు పనుల్లో భాగంగా ప్రయోగశాలల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించాం. ప్రయోగ పరీక్షలకు సంబంధించి గతేడాదే అన్ని పాఠశాలలకూ పరికరాలు అందజేశాం. వీటిని ఉపయోగించేలా చర్యలు తీసుకుంటాం. - పి.కిరణ్‌కుమార్‌, గిరిజన సంక్షేమ ఉప సంచాలకుడు, పార్వతీపురం

లా చేయాలి..●

ప్రయోగాలు చేసే గదిలోకి గాలి, వెలుతురు సక్రమంగా రావడంతో పాటు విద్యుత్తు సౌకర్యం ఉండాలి. ప్రథమ చికిత్స కిట్లను అందుబాటులో ఉంచుకోవాలి.●

ప్రతి 40 మంది విద్యార్థులకూ ఐదు మైక్రోస్కోపులను తప్పనిసరిగా ఇవ్వాలి.●

పాడైన పరికరాలను ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయించడంతో పాటు భద్రపరిచేందుకు అల్మారాలు, బీరువాలు ఏర్పాటు చేసుకోవాలి.●

ఎప్పటికప్పుడు ప్రయోగాలు చేయిస్తూ, పోటీల్లో పాల్గొనేలా చేయాలి. కానీ ఈ విధానాలేవీ ఎక్కడా అమలు కావడం లేదు.

కొత్తగూడ పాఠశాలలోనిరుపయోగంగా ఇలా..

Read latest Vizianagaram News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని