logo

అంబేడ్కర్‌ స్ఫూర్తితో ఉద్యమం

రాజ్యాంగపరమైన రక్షణను, హక్కును ఉద్యోగికి వరంగా ఇచ్చిన బీఆర్‌ అంబేడ్కర్‌ స్ఫూర్తితో ఉద్యోగులంతా ఉద్యమం కొనసాగిస్తున్నారని పీఆర్‌సీ సాధన సమితి నాయకులు స్పష్టం చేశారు. సమితి రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా బుధవారం బాలాజీ కూడలిలోని అంబేడ్కర్‌

Published : 27 Jan 2022 05:50 IST


అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం ఇస్తున్న పీఆర్‌సీ సాధన సమితి నాయకులు

కలెక్టరేట్, న్యూస్‌టుడే: రాజ్యాంగపరమైన రక్షణను, హక్కును ఉద్యోగికి వరంగా ఇచ్చిన బీఆర్‌ అంబేడ్కర్‌ స్ఫూర్తితో ఉద్యోగులంతా ఉద్యమం కొనసాగిస్తున్నారని పీఆర్‌సీ సాధన సమితి నాయకులు స్పష్టం చేశారు. సమితి రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా బుధవారం బాలాజీ కూడలిలోని అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఉద్యోగుల హక్కులు కాపాడాలని, ప్రభుత్వానికి సద్బుద్ధిని ప్రసాదించాలని, తమ న్యాయమైన కోర్కెలు నెరవేర్చేలా దిశానిర్దేశం చేయాలని అంబేడ్కర్‌ విగ్రహానికి విజ్ఞప్తి చేశారు.ఎమ్మెల్సీ పి.రఘువర్మ, నాయకులు జె.మురళి, పి.రామచంద్రరావు, కె.రామరాజు, డి.సన్యాసిరాజు, ఎన్‌.సురేష్, కె.వెంకటరమణ, ఎస్‌వీ శ్రీకాంత్, టి.గోవింద్, కె.రామరాజు, ఎల్‌వీ యుగంధర్, ఎం.గంగాప్రసాద్, అధిక సంఖ్యలో ఉద్యోగ, ఉపాధ్యాయులు, పింఛనర్లు పాల్గొన్నారు. 
పనికి తగ్గ వేతనమివ్వాలి
గంటస్తంభం, న్యూస్‌టుడే: సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగుల ఐకాస జిల్లా ప్రధాన కార్యదర్శి జి.మహేంద్రబాబు డిమాండు చేశారు. ఈ మేరకు ఉద్యోగులతో కలసి కలెక్టరేట్‌ వద్ద ఉన్న అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. పీఆర్‌సీ జీవోలను రద్దు చేసి, ఒప్పంద, పొరుగుసేవల ఉద్యోగుల డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. పి.శ్రీధర్, కె.మనోజ్, అప్పారావు సుధీర్, విజయలక్ష్మి, మూర్తి తదితరులు పాల్గొన్నారు. 

ఆయుష్‌ సేవలు ప్రారంభం 
విజయనగరం వైద్య విభాగం, న్యూస్‌టుడే: ప్రభుత్వ ఆయుర్వేద శాఖ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రాసుపత్రి ప్రాంగణంలోని ఆయుష్‌ భవనంలో కొవిడ్‌ కంట్రోల్‌ ఓపీ సేవలను అందుబాటులోకి తెచ్చినట్లు సీనియర్‌ వైద్యాధికారి బి.వరప్రసాద్‌ తెలిపారు. ఈ సేవలు 24 గంటలు అందుబాటులో ఉంటాయన్నారు. ఆయుర్వేద, యునాని, హోమియో మందులు ఉచితంగా అందించడంతో పాటు కొవిడ్‌ బారిన పడకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఒకవేళ లక్షణాలు ఉంటే ఏ విధంగా అప్రమత్తం కావాలి? తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారన్నారు. మూడు విడతల్లో వైద్యులు, వైద్య సిబ్బంది కంట్రోల్‌ రూమ్‌లో ఉంటారని, ఏమైనా సందేహాలుంటే 94942 38806 నంబరులో సంప్రదించవచ్చని పేర్కొన్నారు. 
నూరుశాతం కొవిడ్‌ వ్యాక్సినేషన్‌
కలెక్టరేట్, న్యూస్‌టుడే: జిల్లాలో మొదటి డోసు కొవిడ్‌ టీకా వేసే ప్రక్రియ వంద శాతం పూర్తయ్యింది. 18 ఏళ్లు దాటిన వారందరికీ ఇప్పటికే పూర్తి చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇటీవల 15-17 ఏళ్ల మధ్య వారికి టీకా వేసే ప్రక్రియ ప్రారంభించారు. ఈ వయసున్న 1,13,017 మందికి వేయాలని లక్ష్యంగా పెట్టుకోగా 1,13,022 మందికి పూర్తి చేశారు. ఇదే స్ఫూర్తితో రెండో డోసును పూర్తి చేయాలని కలెక్టర్‌ సూర్యకుమారి కోరారు. 

విజయవాడలో జరిగిన గణతంత్ర వేడుకల పరేడ్‌లో అత్యుత్తమ ప్రదర్శనతో మొదటి బహుమతి పొందిన విజయనగరం 5వ ఏపీఎస్పీ బెటాలియన్‌ బృందానికి ట్రోఫీ అందిస్తున్న గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని