logo

ఓటింగ్‌ శాతం పెంపునకు కృషి

జిల్లాలో ఓటింగ్‌ శాతం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఎన్నికల పరిశీలకులు హనీష్‌ చాబ్రా, తలాత్‌ పర్వేజ్‌ కోరారు.

Published : 27 Apr 2024 04:58 IST

మాట్లాడుతున్న పరిశీలకులు హనీష్‌ చాబ్రా, తలాత్‌ పర్వేజ్‌

విజయనగరం అర్బన్‌, న్యూస్‌టుడే: జిల్లాలో ఓటింగ్‌ శాతం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఎన్నికల పరిశీలకులు హనీష్‌ చాబ్రా, తలాత్‌ పర్వేజ్‌ కోరారు. ఓట్ల స్లిప్పులను పూర్తి వివరాలతో శతశాతం పంపిణీ చేయాలని ఆదేశించారు. కలెక్టరేట్‌లో శుక్రవారం సాయంత్రం జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. మారుమూల ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలకు సిబ్బంది చేరుకునేందుకు అనువైన వాహనాలను సమకూర్చాలన్నారు. నామినేషన్‌ ప్రక్రియ పూర్తయినందున కోడ్‌ ఉల్లంఘనలు జరిగే అవకాశముందని, ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పారు. పోలింగ్‌ కేంద్రాల్లోకి చరవాణులు, కెమెరాలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. పోలీసు విభాగం పరిశీలకుడు సచీంద్ర పటేల్‌ మాట్లాడుతూ శాంతియుత వాతావరణంలో పోలింగ్‌ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. శనివారం ఉదయం 10.30 గంటల నుంచి 11.30 వరకు పోలీసు అతిథిగృహంలో ఫిర్యాదులు స్వీకరించనున్నామని, చరవాణి ద్వారా తెలియజేయాలనుకుంటే 70751 96069 నంబరును సంప్రదించాలన్నారు. కలెక్టర్‌ నాగలక్ష్మి, ఎస్పీ దీపిక ఎం.పాటిల్‌, సంయుక్త కలెక్టర్‌ కె.కార్తీక్‌, సహాయ కలెక్టర్‌ వెంకట త్రివినాగ్‌, డీఆర్వో ఎస్‌.డి.అనిత పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని