logo

దిశ యాప్‌తో మహిళలకు భద్రత

మహిళల భద్రతకు దిశ యాప్‌ భరోసాగా నిలుస్తుందని జడ్పీ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. పోలీసుశాఖ ఆధ్వర్యంలో ‘దిశ యాప్‌’ డౌన్‌లోడ్, రిజిస్ట్రేషన్‌కు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద ఉన్న మెసానిక్‌ ఫంక్షన్‌ హాల్‌లో

Published : 20 May 2022 04:24 IST


మాట్లాడుతున్న శ్రీనివాసరావు, చిత్రంలో ఎమ్మెల్యే, ఎస్పీ

నేరవార్తా విభాగం, న్యూస్‌టుడే: మహిళల భద్రతకు దిశ యాప్‌ భరోసాగా నిలుస్తుందని జడ్పీ ఛైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. పోలీసుశాఖ ఆధ్వర్యంలో ‘దిశ యాప్‌’ డౌన్‌లోడ్, రిజిస్ట్రేషన్‌కు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద ఉన్న మెసానిక్‌ ఫంక్షన్‌ హాల్‌లో గురువారం నిర్వహించిన మెగా డ్రైవ్‌ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. మహిళలు తక్షణ రక్షణకు ఈ యాప్‌లోని ఎస్‌ఓఎస్‌ బటన్‌ నొక్కితే చాలన్నారు. రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు, ఎస్పీ దీపిక ఎం.పాటిల్, అదనపు ఎస్పీ పి.సత్యనారాయణరావు, దిశ డీఎస్పీ టి.త్రినాథ్, సీఐ ఎం.శేషు, ఎస్‌బీ సీఐ జి.రాంబాబు, డీసీఆర్‌బీ సీఐ బి.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని