logo

చూస్తుంటే.. మరో రుషికొండలా ఉందే

దత్తిరాజేరు మండలం కన్నాం గ్రామ సమీపంలోని పచ్చగా ఉన్న కొండ మరో రుషికొండను తలపిస్తోంది. అక్రమార్కులు దీనిని ఇలా తయారు చేశారు. కన్నాం, చినకాద, గడసాం గ్రామాల రైతులు, గొర్రెలకాపరులు ఈ కొండపైనే మూగజీవాల్ని మేపుతుంటారు.

Published : 26 Apr 2024 03:53 IST

న్యూస్‌టుడే, దత్తిరాజేరు: దత్తిరాజేరు మండలం కన్నాం గ్రామ సమీపంలోని పచ్చగా ఉన్న కొండ మరో రుషికొండను తలపిస్తోంది. అక్రమార్కులు దీనిని ఇలా తయారు చేశారు. కన్నాం, చినకాద, గడసాం గ్రామాల రైతులు, గొర్రెలకాపరులు ఈ కొండపైనే మూగజీవాల్ని మేపుతుంటారు. ఇప్పుడు వారంతా ఇబ్బందులు పడుతున్నారు. అక్రమ తవ్వకాలపై గడసాం గ్రామానికి చెందిన కొంతమంది యువకులు పలుమార్లు మండల, జిల్లా కేంద్రాల్లో అధికారులకు ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం. తాను బాధ్యతలు చేపట్టిన తర్వాత తవ్వకాలకు అనుమతులు ఇవ్వలేదని, గతంలో ఏం జరిగిందో తెలియదని తహసీల్దారు సుదర్శన్‌ ‘న్యూస్‌టుడే’తో అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని