logo

పది తప్పినా పట్టభద్రుల ఓటు!

కనీస విద్యార్హత డిగ్రీ ఉంటేనే పట్టభద్రుల ఓటరుగా అవకాశం కల్పిస్తారు. కానీ బొబ్బిలి నియోజకవర్గంలో పదో తరగతి, ఇంటర్‌ తప్పిన వారితో పాటు నిరక్షరాస్యుల పేర్లు ముసాయిదా జాబితాలో పొందుపర్చడంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు.

Published : 29 Nov 2022 03:32 IST

తప్పుల తడకగా ముసాయిదా జాబితా

ఆకుల చిన్నంనాయుడు విద్యార్హత.. ఇంటర్‌

* రామభద్రపురం మండలం మామిడివలసకు చెందిన ఆకుల చిన్నంనాయుడును ఓటరుగా నమోదు చేసి విద్యార్హత ఇంటర్‌గా, శ్రీరామ్‌నగర్‌ కాలనీకి చెందిన మీసాల అప్పలరాజుకు పదో తరగతిగా చూపించారు. రామభద్రపురంలో యజ్జల ప్రతాప్‌కుమార్‌ పదో తరగతి ఫెయిల్‌గా, కె.సంతోష్‌, ఆర్‌.చంటిలను నిరక్షరాస్యులుగా నమోదు చేసి ఓటు కల్పించారు.

* ఓటరు జాబితాలో పలువురు ఓటర్ల విద్యార్హత గురించి ఆ కాలమ్‌లో చూపలేదు. తెర్లాం మండలంలో సీరియల్‌ నం. 388లో చప్ప మధుకు విద్యార్హత చూపలేదు. నం.265లో సుధీర్‌ పేరు ఎదుట ఏమీ పేర్కొనలేదు.

న్యూస్‌టుడే, బొబ్బిలి


కనీస విద్యార్హత డిగ్రీ ఉంటేనే పట్టభద్రుల ఓటరుగా అవకాశం కల్పిస్తారు. కానీ బొబ్బిలి నియోజకవర్గంలో పదో తరగతి, ఇంటర్‌ తప్పిన వారితో పాటు నిరక్షరాస్యుల పేర్లు ముసాయిదా జాబితాలో పొందుపర్చడంతో అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. బొబ్బిలిలో పోలింగ్‌ కేంద్రం నంబర్లు 85, 86, 87, 88లోని జాబితాల్లో తప్పిదాలు కనిపించాయి. కొంతమంది ఓటర్లు పట్టభద్రులుగా నమోదు కాలేదు. మరికొందరికి విద్యార్హత చూపలేదు. ఇక కొందరి చిరునామాలు కూడా సక్రమంగా లేవు. ఇది ఎలా జరిగిందో అధికారులు సైతం చెప్పలేని పరిస్థితి. జాబితాలో అవకతవకలు చోటుచేసుకున్నాయని ప్రజా సంఘాల ఐక్య వేదిక కన్వీనర్‌ కె.విజయగౌరి అన్నారు. అర్హత లేని వారిని ఓటర్లుగా చేర్చారని, జాబితాలను సవరించకుంటే ఆందోళన చేస్తామని విలేకరులతో అన్నారు.


ఉన్నతాధికారులకు తెలిపాం

ఇది ముసాయిదా మాత్రమే. ఎక్కడ లోపాలు ఉన్నా సవరించేందుకు చర్యలు తీసుకుంటాం. పోలింగ్‌ కేంద్రాలు 85, 86, 87, 88 పరిధిలో ఆన్‌లైన్‌ ద్వారా 1368, ఆఫ్‌లైన్‌లో 3273 వచ్చాయి. వీటిని నివేదించగా ముసాయిదాలో 4479 ఓట్లుగా చూపించారు. దీనిపై ఉన్నతాధికారులకు తెలియజేశాం.

ఎన్‌.రాజారావు, తహసీల్దారు, బొబ్బిలి
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని