logo

అమ్మో..అక్కడఉండలేం

సాలూరులోని ప్రాంతీయ ఆసుపత్రి వద్ద రోగులు, వారి సహాయకుల అవస్థలివి. ఇక్కడ 30 పడకలు ఉండగా.. శుక్రవారం రోగుల సంఖ్య 132కి చేరింది.

Published : 03 Jun 2023 03:39 IST

న్యూస్‌టుడే, సాలూరు: సాలూరులోని ప్రాంతీయ ఆసుపత్రి వద్ద రోగులు, వారి సహాయకుల అవస్థలివి. ఇక్కడ 30 పడకలు ఉండగా.. శుక్రవారం రోగుల సంఖ్య 132కి చేరింది. దీంతో వరండాలు, చెట్ల కింద మంచాలు వేసి వైద్యం అందిస్తున్నారు. మధ్యాహ్నం వేళ ఎండ వేడిమికి వార్డుల్లో ఉండలేక చాలామంది బయటకు వచ్చేశారు. పంకాలు లేవని, చిన్నారులు, వృద్ధులు ఉండలేకపోతున్నారని పలువురు వాపోయారు. కొందరు సహాయకులు విసనకర్రలతో పడరాని పాట్లు పడ్డారు. ఈ పరిస్థితిపై వైద్యాధికారి రత్నంను ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా.. ఆసుపత్రికి వచ్చిన వారందరికీ వైద్యం అందించేందుకు వరండాల్లో మంచాలు వేసినట్లు చెప్పారు. వార్డుల్లో పంకాలున్నాయని, బయట లేవన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని