logo

‘రచ్చబండ.. సంగ్రామ యాత్రతో ఒరిగేది శూన్యం’

గతంలో పదేళ్లకు పైగా అధికారంలో ఉన్న కాంగ్రెస్‌, ప్రస్తుత భాజపా పాలనలో ప్రజాసమస్యలపై కేంద్రంలో నోరుమెదపకుండా ప్రస్తుతం రచ్చబండ, ప్రజాసంగ్రామ యాత్రలు చేపట్టడంవల్ల రాష్ట్రానికి ఒరిగేది శూన్యమని మంత్రి సత్యవతిరాథోడ్‌ అన్నారు

Published : 27 May 2022 03:25 IST

కొత్తతండాలో మాట్లాడుతున్న మంత్రి సత్యవతిరాథోడ్‌

నర్సింహులపేట, న్యూస్‌టుడే: గతంలో పదేళ్లకు పైగా అధికారంలో ఉన్న కాంగ్రెస్‌, ప్రస్తుత భాజపా పాలనలో ప్రజాసమస్యలపై కేంద్రంలో నోరుమెదపకుండా ప్రస్తుతం రచ్చబండ, ప్రజాసంగ్రామ యాత్రలు చేపట్టడంవల్ల రాష్ట్రానికి ఒరిగేది శూన్యమని మంత్రి సత్యవతిరాథోడ్‌ అన్నారు. మహబూబాబాద్‌ జిల్లా నర్సింహులపేట మండలం జగ్గుతండా గురువారం విలేకరులతో మాట్లాడారు. విభజన చట్టం హామీలు నెరవేర్చకుండా భాజపా నేతలు చౌకబారు రాజకీయాలు చేస్తూన్నారని ఆరోపించారు. కులాల మధ్య కాంగ్రెస్‌ నేత రేవంత్‌రెడ్డి, మతాల మధ్య భాజపా నేతలు చిచ్చు పెడుతూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని దుయ్యబట్టారు. రాష్ట్రంపై భాజపా సవతితల్లి ప్రేమ చూపెడుతోందన్నారు. న్యాయంగా రాష్ట్రానికి రావాల్సిన హక్కులను భాజపా కాలరాస్తోందన్నారు. గిరిజన రిజర్వేషన్లను ఐదేళ్లుగా పట్టించుకోవడం లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ప్రతిపక్ష పార్టీల నాయకులు ఆరోపణలు మానుకొని రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలన్నారు. దాట్ల, జగ్గుతండా పెద్దనాగారం స్టేజీ సర్పంచులు కొమ్మినేని రవీందర్‌, హోళీనాయక్‌, సోమిరెడ్డి, మాజీ సర్పంచి భిక్షంరెడ్డి, తెరాస నేతలున్నారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని