logo

రైల్వే లోకో ఇన్‌స్పెక్టర్‌కు బురిడీ, రూ.1.12 లక్షలు మాయం

క్యూఆర్‌ కోడ్‌తో రైల్వే లోకో ఇన్‌స్పెక్టర్‌ను బురిడీ కొట్టించిన సైబర్‌ నేరస్థులు రూ.1.12లక్షలు కొల్లగొట్టిన ఘటనపై బుధవారం కాజీపేట సీఐ మహేందర్‌రెడ్డి కేసు నమోదు చేశారు. కాజీపేట సిద్ధార్థనగర్‌కు

Published : 18 Aug 2022 05:24 IST

కాజీపేట టౌన్‌, న్యూస్‌టుడే: క్యూఆర్‌ కోడ్‌తో రైల్వే లోకో ఇన్‌స్పెక్టర్‌ను బురిడీ కొట్టించిన సైబర్‌ నేరస్థులు రూ.1.12లక్షలు కొల్లగొట్టిన ఘటనపై బుధవారం కాజీపేట సీఐ మహేందర్‌రెడ్డి కేసు నమోదు చేశారు. కాజీపేట సిద్ధార్థనగర్‌కు చెందిన సుంచు పేరయ్య లోకో ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తుంటారు. తన వాషింగ్‌ మిషన్‌ను ఓఎల్‌ఎక్స్‌లో రూ.5వేలకు అమ్మకానికి పెట్టి చరవాణి నెంబర్‌ అప్‌లోడ్‌ చేశారు. ఆగంతకులు ఫోన్‌ చేసి మీ వాషింగ్‌ మిషన్‌ కొనుగోలు చేస్తామంటూ క్యూఆర్‌ కోడ్‌ను పంపించి స్కాన్‌ చేయమన్నారు. అలాగే చేయడంతో పేరయ్య బ్యాంకు ఖాతా నుంచి రూ.1.12,730 ఇతర ఖాతాల్లోకి వెళ్లిపోయాయి. బాధితుడు ఖాతాను బ్లాక్‌ చేయించి కాజీపేట ఠాణాలో ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని