logo

మహాత్ముని బాట అనుసరణీయం

 స్వాతంత్య్ర పోరాటంలో మహాత్మా గాంధీ అనుసరించిన సత్యాగ్రహం, అహింసా పద్ధతులు  ప్రతి ఒక్కరికీ అనుసరణీయమని జిల్లా అదనపు కలెక్టర్లు శ్రీవత్స, హరిసింగ్‌ ఉద్ఘాటించారు. ఆదివారం గాంధీ జయంతి సందర్భంగా కలెక్టరేట్‌లో బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

Published : 03 Oct 2022 01:54 IST

బల్దియా కార్యాలయంలో గాంధీ విగ్రహానికి పూలమాల వేస్తున్న మేయర్‌ సుధారాణి

వరంగల్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే:  స్వాతంత్య్ర పోరాటంలో మహాత్మా గాంధీ అనుసరించిన సత్యాగ్రహం, అహింసా పద్ధతులు  ప్రతి ఒక్కరికీ అనుసరణీయమని జిల్లా అదనపు కలెక్టర్లు శ్రీవత్స, హరిసింగ్‌ ఉద్ఘాటించారు. ఆదివారం గాంధీ జయంతి సందర్భంగా కలెక్టరేట్‌లో బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.  ఆయన బోధించిన శాంతి- అహింసా మార్గాలు ప్రపంచమంతా శాంతియుతంగా జీవించేందుకు  తోడ్పడతాయన్నారు. కలెక్టరేట్‌ నిర్వహణాధికారి శ్రీకాంత్‌, కలెక్టరేట్‌ సిబ్బంది పాల్గొన్నారు.

రంగంపేట: మహాత్మా గాంధీ జయంతిని బల్దియా ప్రధాన కార్యాలయంలో నిర్వహించారు. మేయర్‌ గుండు సుధారాణి, అదనపు కమిషనర్‌ రషీˆద్‌, ఎస్‌ఈ ప్రవీణ్‌చంద్ర, ఆరోగ్యాధికారి డాక్టర్‌ రాజేష్‌, ఈఈ సంజయ్‌కుమార్‌ తదితరులు గాంధీ విగ్రహానికి పూలమాలేసి నివాళులర్పించారు. హనుమకొండలోని జిల్లా కాంగ్రెస్‌ భవన్‌లో డీసీˆసీˆ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి, వర్ధన్నపేట సమన్వయకర్త నమిండ్ల శ్రీనివాస్‌, జిల్లా మహిళా అధ్యక్షురాలు సరళాయాదవ్‌ తదితరులు గాంధీ చిత్ర పటానికి పూల మాలేశారు.

కలెక్టరేట్‌లో నివాళులర్పిస్తున్న అదనపు కలెక్టర్లు శ్రీవత్స, హరిసింగ్‌, సిబ్బంది

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని