logo

సీరోలులో తహసీల్దారు కార్యాలయం ప్రారంభం

మహబూబాబాద్‌ జిల్లాలో నూతనంగా ఏర్పడిన సీరోలు మండలంలో సోమవారం తహసీల్దార్‌ కార్యాలయం ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్‌ శశాంకతో కలిసి మహబూబాబాద్‌ ఎంపీ మాలోతు కవిత, డోర్నకల్‌ శాసనసభ్యుడు రెడ్యానాయక్‌ ప్రారంభించారు.

Updated : 18 Oct 2022 06:23 IST

కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న ఎంపీ కవిత, ఎమ్మెల్యే రెడ్యానాయక్‌. చిత్రంలో

కలెక్టర్‌ శశాంక, మాజీ ఎమ్మెల్సీ వెంకటరెడ్డి తదితరులు

సీరోలు (డోర్నకల్‌, కురవి), న్యూస్‌టుడే: మహబూబాబాద్‌ జిల్లాలో నూతనంగా ఏర్పడిన సీరోలు మండలంలో సోమవారం తహసీల్దార్‌ కార్యాలయం ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్‌ శశాంకతో కలిసి మహబూబాబాద్‌ ఎంపీ మాలోతు కవిత, డోర్నకల్‌ శాసనసభ్యుడు రెడ్యానాయక్‌ ప్రారంభించారు. దీంతో సీరోలు ప్రాంత చిరకాల స్వప్నం నెరవేరింది. డోర్నకల్‌ మండలంలోని మన్నెగూడెం, కురవి మండలంలోని కాంపల్లి, చింతపల్లి, తాళ్లసంకీస, ఉప్పరిగూడెం రెవెన్యూ గ్రామాలను కలుపుతూ సీరోలు మండలం ఏర్పాటైంది. వేడుక తిలకించడానికి ఆయా గ్రామాల ప్రజలతో పాటు పరిసర ప్రాంతవాసులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో సీరోలు జనసంద్రమైంది. ఎంపీ కవిత, ఎమ్మెల్యే రెడ్యానాయక్‌, కలెక్టర్‌ శశాంకకు ప్రజలు పూలుచల్లుతూ స్వాగతం పలికారు. బాణసంచా కాల్చారు. గ్రామ శివారు నుంచి కార్యాలయం దాక ఊరేగింపు నిర్వహించారు. ప్రదర్శన అగ్రభాగాన మహిళలు కోలాట నృత్యం చేశారు. కురవి తహసీల్దార్‌ ఇమ్మానుయేల్‌ ఏర్పాట్లు పర్యవేక్షించారు. తహసీల్దారు కార్యాలయంతో పాటు కంప్యూటర్‌ గది ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ వెడవెల్లి వెంకట్రెడ్డి, ఆర్డీవో కొమురయ్య, సర్పంచి శ్యామల రంగమ్మ, ఎంపీటీసీ సభ్యుడు భోజ్యానాయక్‌, ఎంపీపీ గుగులోతు పద్మావతి, మార్కెట్‌ అధ్యక్షురాలు బజ్జూరి ఉమ, డోర్నకల్‌ జడ్పీటీసీ సభ్యురాలు కమల, అధికారులు, నేతలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని