logo

దివ్యాంగుల దినోత్సవం.. నృత్యాలతో ఉల్లాసం

అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మల్లికాంబ మనోవికాస కేంద్రం ఆధ్వర్యంలో నక్కలగుట్టలోని అంబేడ్కర్‌ కూడలిలో శనివారం మానసిక వికలాంగులతో ఫ్లాష్‌మాబ్‌ కార్యక్రమం నిర్వహించారు.

Published : 04 Dec 2022 04:47 IST

దివ్యాంగులతో కలిసి చేతులు ఊపుతున్న ఎమ్మెల్సీ కడియం శ్రీహరి

బాలసముద్రం, న్యూస్‌టుడే : అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా మల్లికాంబ మనోవికాస కేంద్రం ఆధ్వర్యంలో నక్కలగుట్టలోని అంబేడ్కర్‌ కూడలిలో శనివారం మానసిక వికలాంగులతో ఫ్లాష్‌మాబ్‌ కార్యక్రమం నిర్వహించారు. జాతీయ గీతాలు, చలనచిత్ర గీతాలకు దివ్యాంగుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యతిథిగా పాల్గొన్న ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మాట్లాడుతూ దివ్యాంగుల సాధికారత కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీˆఆర్‌ ప్రత్యేక శాఖ ఏర్పాటు చేశారన్నారు. నగరంలోని దివ్యాంగులు, ప్రత్యేక అవసరాలు కలిగిన వారికి కోసం ప్రత్యేకంగా సదరం క్యాంపు ఏర్పాటు చేయాలని మల్లికాంబ నిర్వాహకురాలు రామలీల విజ్ఞప్తి చేయగా తప్పకుండా ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేయడానికి కృషి చేస్తానని కడియం హామీ ఇచ్చారు. మల్లికాంబ కేంద్రానికి రూ.లక్ష ఆర్థిక సాయం ప్రకటించారు. కుడా ఛైర్మన్‌ సుందర్‌రాజ్‌, జిల్లా సంక్షేమ అధికారిణి సబిత, చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ ఛైర్‌పర్సన్‌ వసుద, అనురాగ్‌ హెల్పింగ్‌ సొసైటీ వ్యవస్థాపకురాలు డాక్టర్‌ కరుకాల అనితారెడ్డి, మల్లికాంబ నిర్వాహకులు ప్రొఫెసర్‌ పద్మ, బండా సదానందరావు, కోడెం కళ్యాణ్‌ తదితరులున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని