లక్ష్యం మేరకు కంటి పరీక్షలు
కంటివెలుగు కార్యక్రమంలో భాగంగా ప్రతి రోజు గ్రామీణ ప్రాంతాల్లో 300 మందికి, పట్టణ ప్రాంతాల్లో 400 మందికి కంటి పరీక్షలు నిర్వహించాలని లక్ష్యాలను నిర్దేశించుకున్నా.
మాట్లాడుతున్న పాలనాధికారి గోపి
వరంగల్ కలెక్టరేట్, న్యూస్‌టుడే: కంటివెలుగు కార్యక్రమంలో భాగంగా ప్రతి రోజు గ్రామీణ ప్రాంతాల్లో 300 మందికి, పట్టణ ప్రాంతాల్లో 400 మందికి కంటి పరీక్షలు నిర్వహించాలని లక్ష్యాలను నిర్దేశించుకున్నా.. ప్రస్తుతం సగటున 133 మందికి మాత్రమే నిర్వహిస్తున్నట్లు జిల్లా పాలనాధికారి గోపి వెల్లడించారు. జిల్లాలో కంటివెలుగు నిర్వహణ తీరుతెన్నులపై కలెక్టరేట్‌లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో శనివారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామ, పట్టణ స్థాయిలో కంటివెలుగు కార్యక్రమానికి విస్త్రృత ప్రచారం కల్పించి వీలైనంత ఎక్కువమంది కళ్లను పరీక్షించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. శిబిరానికి వచ్చే జనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని స్థానిక ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాలతో చర్చించి.. శిబిరాలను అవసరమైన ఇతర ప్రాంతాలకు తరలించాలన్నారు. శిబిరాలకు వచ్చే వారి వివరాలను పూర్తి పరిశీలన తర్వాతే ఆన్‌లైన్‌లో నమోదుచేయాలన్నారు. పరీక్షించే యంత్రాల్లో ఏవైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించేలా చొరవ తీసుకోవాలని జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటరమణకు సూచించారు. అదనపు కలెక్టర్ అశ్వినీ తానాజీ, డాక్టర్ వంశీధర్, డాక్టర్ వెంకటరమణ, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Crime News : కుమార్తెను చంపి ‘కరెంట్ షాక్’ నాటకం
-
Ap-top-news News
Andhra News: ఆసుపత్రి భవనానికి వైకాపా రంగులు..!
-
India News
పానీపూరీ అమ్ముతున్న లేడీ డాక్టర్!.. ఇలా చేయడం వెనుక పెద్ద కారణమే
-
Politics News
నన్ను ఓడించేందుకు ప్రయత్నాలు జరిగాయి: మంత్రి పువ్వాడ అజయ్
-
Ts-top-news News
ఉచిత వై-ఫైతో ఏసీ స్లీపర్ బస్సులు
-
Movies News
దేవుడితో పని పూర్తయింది!.. పవన్‌తో కలిసి ఉన్న వర్కింగ్ స్టిల్‌ను పంచుకున్న సముద్రఖని