logo

అంధులు అదుర్స్‌!!

కళ్లు కనిపించకపోయినా చదువులో రాణిస్తున్నారు.. పలు రంగాల్లో అబ్బురపరుస్తున్నారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలోని కార్మెల్‌ స్కూల్‌లో 15 మంది అంధ విద్యార్థులు ఉన్నారు.

Published : 08 Feb 2023 05:09 IST

విద్యార్థులకు శిక్షణ ఇస్తున్న ఉపాధ్యాయుడు

కళ్లు కనిపించకపోయినా చదువులో రాణిస్తున్నారు.. పలు రంగాల్లో అబ్బురపరుస్తున్నారు. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలోని కార్మెల్‌ స్కూల్‌లో 15 మంది అంధ విద్యార్థులు ఉన్నారు. వీరికి యాజమాన్యం ఉచితంగా వసతితో పాటు భోజనం పెడుతోంది. స్థానికంగా ప్రత్యేకంగా అంధ ఉపాధ్యాయుడితో బోధన అందిస్తోంది. బ్రెయిలీ లిపితో చదువుతో పాటు వివిధ వాయిద్యాల్లో ప్రావీణ్యం పొందుతున్నారు. మనో నేత్రంతో చూస్తారు. నిత్యం చదరంగం, క్యారమ్స్‌, రిథమ్‌ప్యాడ్‌, గిటార్‌, కాంగో, డ్రామ్స్‌తో పాటు వైకుంఠపాలి, లూడో ఆడుతారు. రోజూ శిక్షకుడు శ్రీనివాస్‌ కంప్యూటర్‌ నేర్పిస్తున్నారు. రెండేళ్ల క్రితం హైదరాబాద్‌లో జరిగిన ఛాలెంజ్‌ పర్సన్‌ పోటీలో ప్రతిభ కన బరిచారు. హనుమకొండలో జరిగిన ప్యారా ఒలింపిక్‌లో పాల్గొన్నారు. వీరిని అందరి విద్యార్థులతో సమానంగా చూస్తామని ప్రిన్సిపల్‌ లిస్సెల్‌, అంధ విద్యార్థుల పర్యవేక్షకురాలు దివ్వమరియా తెలిపారు.

న్యూస్‌టుడే, ఎల్కతుర్తి (హనుమకొండ జిల్లా)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని