logo

కొడకండ్లకు మినీ టెక్స్‌టైల్‌ పార్క్‌ తెస్తా

చేనేత కార్మికులు అధికంగా ఉన్న కొడకండ్లలో మినీ టెక్స్‌టైల్‌ పార్క్‌ ఏర్పాటు చేసి... పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు వరంగల్‌ లోక్‌సభ భాజపా అభ్యర్థి అరూరి రమేశ్‌ హామీ ఇచ్చారు. కొడకండ్ల, దేవరుప్పుల మండలాల్లో సోమవారం నిర్వహించిన రోడ్‌షో కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు.

Published : 30 Apr 2024 03:35 IST

దేవరుప్పులలో ప్రసంగిస్తున్న వరంగల్‌ భాజపా ఎంపీ అభ్యర్థి అరూరి రమేశ్‌

కొడకండ్ల, దేవరుప్పుల రూరల్‌, న్యూస్‌టుడే: చేనేత కార్మికులు అధికంగా ఉన్న కొడకండ్లలో మినీ టెక్స్‌టైల్‌ పార్క్‌ ఏర్పాటు చేసి... పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు వరంగల్‌ లోక్‌సభ భాజపా అభ్యర్థి అరూరి రమేశ్‌ హామీ ఇచ్చారు. కొడకండ్ల, దేవరుప్పుల మండలాల్లో సోమవారం నిర్వహించిన రోడ్‌షో కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. దేశ భద్రత, ప్రజల సంక్షేమం మోదీతోనే సాధ్యమనే విషయాన్ని ప్రజలు నమ్ముతున్నారని చెప్పారు. వరంగల్‌ నుంచి తనను మోదీ జట్టులోకి పంపితే ఉమ్మడి జిల్లా అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తానన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి కావ్యకి ప్రజా సమస్యలు తెలియవన్నారు. కరీంనగర్‌ జిల్లాకు చెందిన భారాస అభ్యర్థి సుధీర్‌కుమార్‌కి స్థానిక సమస్యలపై అవగాహన లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. వరంగల్‌ జిల్లా వాసిగా పదేళ్లు ప్రజాసేవలో ఉన్న తనను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్‌ లేగ రాంమోహన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఆరుట్ల దశమంత్‌రెడ్డి, ఉపాధ్యక్షులు దుబ్బా రాజశేఖర్‌, మండలాధ్యక్షులు ఉపేందర్‌, సత్తయ్య, నాయకులు నవీన్‌రెడ్డి, శ్రీమాన్‌, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని