logo

లోక్‌సభ ఎన్నికలకు భద్రత కట్టుదిట్టం

వరంగల్‌ లోక్‌సభ స్థానానికి సంబంధించి పోటీచేసే అభ్యర్థుల పేర్లు ఖరారు చేసి.. వారికి గుర్తులు కేటాయించినట్లు రిటర్నింగ్‌ అధికారి ప్రావీణ్య వెల్లడించారు.

Published : 01 May 2024 05:52 IST

వరంగల్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: వరంగల్‌ లోక్‌సభ స్థానానికి సంబంధించి పోటీచేసే అభ్యర్థుల పేర్లు ఖరారు చేసి.. వారికి గుర్తులు కేటాయించినట్లు రిటర్నింగ్‌ అధికారి ప్రావీణ్య వెల్లడించారు. వరంగల్‌ కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. వరంగల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గానికి సంబంధించి ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో 1900 పోలింగ్‌ కేంద్రాలు.. 18,24,466 మంది ఓటర్లు, 1,026 సర్వీసు ఓటర్లు ఉన్నారన్నారు. ప్రతీ పోలింగ్‌ కేంద్రానికి మూడు ఈవీఎంల చొప్పున ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మొత్తం 247 సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలను గుర్తించామని, 1,309 పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌, 397 పోలింగ్‌ కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు, 497 మంది మైక్రో అబ్జర్వర్లతో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

 

 

ః అనంతరం పోలీసు కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా మాట్లాడుతూ.. సార్వత్రిక ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు పోలీస్‌ సిబ్బందికి శిక్షణ పూర్తి చేశామన్నారు. పోలింగ్‌ కేంద్రాల పరిసర ప్రాంతాల్లో నిరంతరం సీసీ కెమెరాల నిఘా, ప్రత్యేక సాయుధ బలగాలతో భద్రత ఏర్పాటు చేశామన్నారు. డీఆర్వో శ్రీనివాస్‌, డీపీఆర్వో అయూబ్‌అలీ, ఎన్నికల పర్యవేక్షకులు విశ్వనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని