logo

పేదలకు ఉచితంగా న్యాయ సేవలు

జిల్లా కేంద్రంలోని సఖి వన్‌స్టాప్‌ సెంటర్‌ను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీˆనియర్‌ సివిల్‌ న్యాయమూర్తి టి.కన్నయ్యలాల్‌ శనివారం సందర్శించారు.

Published : 05 May 2024 05:37 IST

సఖి కేంద్రంలో వివరాలు తెలుసుకుంటున్న సీనియర్‌ సివిల్‌ జడ్జి కన్నయ్యలాల్‌

ములుగు టౌన్‌, న్యూస్‌టుడే: జిల్లా కేంద్రంలోని సఖి వన్‌స్టాప్‌ సెంటర్‌ను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీˆనియర్‌ సివిల్‌ న్యాయమూర్తి టి.కన్నయ్యలాల్‌ శనివారం సందర్శించారు. సఖి కేంద్రంలో మహిళలకు అందుతున్న సేవలు, సౌకర్యాలు, సమస్యలు, కేసుల వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా బాలల పరిరక్షణ కార్యాలయం, చైల్డ్‌ హెల్ప్‌లైన్‌, బాలల సంక్షేమ సమితి కార్యాలయాన్ని సందర్శించి సేవలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ.. జిల్లా న్యాయసేవాధికార సంస్థ మహిళలు, దివ్యాంగులు, పేదవారికి ఉచితంగా న్యాయ సాయం అందిస్తుందని తెలిపారు. ఉచితంగా న్యాయ సాయం చేసేందుకు ముగ్గురు అడ్వకేట్లు అందుబాటులో ఉంటారని, వారిని ఈ సందర్భంగా సఖి కేంద్రానికి పరిచయం చేశారు. బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో లీగల్‌ ఎయిడ్‌ సభ్యులు మేకల మహేందర్‌, బానోతు స్వామిదాస్‌,  రాచర్ల రాజ్‌కుమార్‌, జిల్లా బాలల పరిరక్షణ అధికారి ఓంకార్‌, సఖి సెంటర్‌ అడ్మిన్‌ లావణ్య, లీగల్‌ ప్రొబిషన్‌ ఆఫీˆసర్‌ డి.సంజీవ్‌, డీసీˆపీˆయూ, సఖి కేంద్రం సిబ్బంది కృష్ణవేణి, సుమన్‌, రాజు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని