logo

శిక్షలు పడితే నేరాల సంఖ్య తగ్గుతుంది

సమాజంలో నేరం చేసిన వారికి శిక్షలు పడితే నేరాల సంఖ్య చాలా వరకు తగ్గుతుందని వరంగల్‌ పోలీసు కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా అన్నారు.

Published : 05 May 2024 05:45 IST

సమావేశంలో మాట్లాడుతున్న సీపీ అంబర్‌ కిషోర్‌ ఝా, అధికారులు

సుబేదారి, న్యూస్‌టుడే: సమాజంలో నేరం చేసిన వారికి శిక్షలు పడితే నేరాల సంఖ్య చాలా వరకు తగ్గుతుందని వరంగల్‌ పోలీసు కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా అన్నారు. కమిషనరేట్‌ పరిధిలో వివిధ నేరాల్లో నిందితులకు కోర్టులో యావజ్జీవ కారాగార శిక్ష విధించడంలో విశేష కృషి చేసిన పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌, విచారణ అధికారులు, కోర్టు విధులు నిర్వర్తించే పోలీసు సిబ్బందికి సీపీ శనివారం ప్రశంసా పత్రాలు అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పోలీసు అధికారులకు, కోర్టుకు, బాధితులకు వారధిగా ఉంటూ శిక్షలు పడే శాతాన్ని గణనీయంగా పెంచాల్సిన బాధ్యత పోలీసు సిబ్బందిపై ఉందన్నారు. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల్లో నిందితులకు శిక్షలు పడే విధంగా కోర్టు విధులు నిర్వర్తించే అధికారులు తీవ్రంగా కృషి చేయాలన్నారు. సమావేశంలో పరిపాలన అదనపు డీసీపీ రవి, డిప్యూటీ  డైరెక్టర్‌ ప్రాసిక్యూషన్‌ ఎం.సత్యనారాయణ, సీపీఆర్‌బీ ఏసీపీ డేవిడ్‌రాజ్‌, ఇన్‌స్పెక్టర్లు గణేశ్‌, శ్రీధర్‌రావు, మామునూర్‌ ఇన్‌స్పెక్టర్‌ రవికుమార్‌, అదనపు పీపీలు రంజిత్‌, రాజమల్లారెడ్డి, స్టీవెన్‌, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని