logo

కాళీపట్నంలో సీసీఎల్‌ఏ పర్యటన

మొగల్తూరు మండలం కాళీపట్నంలో శనివారం సీసీఎల్‌ఏ లక్ష్మీ నృసింహం శనివారం పర్యటించారు.

Published : 05 Feb 2023 03:24 IST

దస్త్రాలను పరిశీలిస్తున్న లక్ష్మీనృసింహం

మొగల్తూరు, న్యూస్‌టుడే: మొగల్తూరు మండలం కాళీపట్నంలో శనివారం సీసీఎల్‌ఏ లక్ష్మీ నృసింహం శనివారం పర్యటించారు. కాళీపట్నం రెవెన్యూ గ్రామం కాళీపట్నం తూర్పు, కాళీపట్నం పడమర, పాతపాడు, జగన్నాథపురం, కోమటితిప్ప గ్రామాల్లో ఉన్న సుమారు ఏడు వేల ఎకరాలకు సంబంధించి భూసమస్య ఆరు దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉంది. సుమారు పదేళ్ల కిందట అప్పటి తహశీల్దారు అహ్మద్‌ జమా ఈ భూముల రిజిస్ట్రేషన్లను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేశారు. కోర్టులో అపరిష్కృతంగా ఉన్న భూసమస్య పరిష్కారానికి ప్రభుత్వం ఇటీవల చర్యలు చేపట్టింది. రీసర్వేలో భాగంగా రెవెన్యూ అధికారులు ఆ ప్రాంత భూముల సర్వే చేపట్టారు. ఈ క్రమంలో సీసీఎల్‌ఏ లక్ష్మీ నృసింహం ఆయా భూములను సందర్శించి దస్త్రాలను పరిశీలించారు. ఆయన వెంట తహశీల్దారు జి.అనితాకుమారి, సర్వేయర్‌ ధనరాజు, పలువురు రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని