logo

వైకాపా మాయలోపడి రాజీనామాలు చెయ్యొద్దు: నిమ్మల

వైకాపా మాయలోపడి వాలంటీర్లు రాజీనామాలు చెయొద్దని, తెదేపా, జనసేన, భాజపా కూటమి అధికారంలో వాలంటీర్‌ వ్యవస్థను కొనసాగించడంతోపాటు రూ.10 వేతనం ఇస్తారని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తెలిపారు.

Published : 23 Apr 2024 06:22 IST

పెనుమదంలో దివ్యాంగుడి నుంచి ఆశీర్వాదం తీసుకుంటున్న ఎమ్మెల్యే రామానాయుడు
పోడూరు, న్యూస్‌టుడే: వైకాపా మాయలోపడి వాలంటీర్లు రాజీనామాలు చెయొద్దని, తెదేపా, జనసేన, భాజపా కూటమి అధికారంలో వాలంటీర్‌ వ్యవస్థను కొనసాగించడంతోపాటు రూ.10 వేతనం ఇస్తారని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తెలిపారు. పెనుమదంలో సోమవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఇంటింటికీ  వెళ్లి సూపర్‌సిక్స్‌ పథకాల కరపత్రాలను అందించి అసెంబ్లీ స్థానానికి సైకిల్‌, ఎంపీ స్థానానికి కమలం గుర్తులపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీటెక్‌, ఎంటెక్‌, డిగ్రీ చదివిన యువత వైకాపా నాయకుల ఉచ్చులోపడి రాజీనామాలు చేసి కష్టలు తెచ్చుకోవద్దన్నారు.గత తెదేపా హయాంలో వేసిన సీసీ రోడ్లు తప్ప అయిదేళ్ల పాలనలో తట్ట కంకర వేసిందేలేదన్నారు. ఎన్టీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని వెల్లడించారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని