logo

బాలుడి అనుమానాస్పద మృత

ఇటీవల విడుదలైన పది ఫలితాల్లో 549 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచిన ఓ బాలుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన శుక్రవారం నూజివీడులో చోటు చేసుకుంది.

Published : 04 May 2024 04:02 IST

నవీన్‌రెడ్డి  (పాత చిత్రం)

నూజివీడు పట్టణం, న్యూస్‌టుడే: ఇటీవల విడుదలైన పది ఫలితాల్లో 549 మార్కులు సాధించి ప్రతిభ కనబరిచిన ఓ బాలుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన శుక్రవారం నూజివీడులో చోటు చేసుకుంది. మృతుడి తండ్రి రామురెడ్డి కథనం మేరకు.. నూజివీడు పట్టణం శారద కాలనీలో నివసిస్తున్న కొవ్వూరు రామురెడ్డికి ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు కొవ్వూరు యశ్వంత్‌ నవీన్‌ రెడ్డి(16) పది ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించాడు. ఇంటర్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి అన్నయ్యతో యశ్వంత్‌ ఒకే గదిలో పడుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున సుమారు నాలుగైదు గంటల సమయంలో అన్నయ్య లేచి చూడగా యశ్వంత్‌ కనిపించలేదు. ఆ విషయాన్ని తండ్రి రామురెడ్డికి చెప్పాడు. కుటుంబసభ్యులు వెతకగా.. మూడు అంతస్తుల మేడపై నుంచి కింద పడి మృతి చెంది కనిపించాడు. వెంటనే ఆ విషయాన్ని పోలీసులకు తెలిపారు. పట్టణ సీఐ ఎంవీవీఎస్‌ఎన్‌ మూర్తి మాట్లాడుతూ.. బాలుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లుగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఏం జరిగిందనేది తెలియాల్సి ఉంది.. మృతదేహంపై బలమైన రాతి వస్తువుతో కొట్టిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. తలపై బలమైన గాయాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మూడో అంతస్తు నుంచి కింద పడిపోయాడా.. లేక ఎవరైనా బలవంతంగా నెట్టి వేశారా.. లేక ప్రణాళిక ప్రకారం హత్య చేశారా.. అనేది తెలియాల్సి ఉంది.

మిత్ర బృందంలో విషాదం.. ఎంతో బాగా చదువుతూ బంగారు భవితను సొంతం చేసుకునే అవకాశం ఉన్న నవీన్‌ రెడ్డి జీవితం ముగిసిపోవడం ఎంతో బాధ కలిగిస్తుందని విద్యా బోధన చేసిన ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఇన్నాళ్లూ తమతో ఆడిపాడి, ఎంతో ఉత్సాహంగా గడిపిన నవీన్‌రెడ్డి ఇక లేడని.. తిరిగి రాడని తెలిసి స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు. పది ఫలితాలు అనంతరం అందరం ఒకే కళాశాలలో చేరదామనుకున్న మిత్ర బృందానికి విషాదం మిగిలింది.


కాలువలో మునిగి కూలీ..

కొయ్యలగూడెం, న్యూస్‌టుడే: రాజవరం సమీపంలో ఎర్ర కాలువ నుంచి వెళ్లే పంట కాలువలో ప్రమాదవశాత్తూ మునిగి అదే గ్రామానికి చెందిన పోతులూరి సత్యనారాయణ(45) మృతి చెందినట్లు ఎస్సై జీజే విష్ణువర్ధన్‌ శుక్రవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయం వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లి కాలువలోకి దిగగా.. గోతులు ఎక్కువగా ఉండటంతో అందులో మునిగిపోయి సత్యనారాయణ చనిపోయాడు. మృతుడి సోదరి అరిగెల వెంకటలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని