logo

కల్యాణం.. రమణీయం

ద్వారకాతిరుమల శ్రీవారి ఉపాలయం లక్ష్మీపురం వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం శుక్రవారం రాత్రి కనుల పండువగా నిర్వహించారు.

Published : 04 May 2024 04:07 IST

కల్యాణమూర్తులు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుడు

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: ద్వారకాతిరుమల శ్రీవారి ఉపాలయం లక్ష్మీపురం వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం శుక్రవారం రాత్రి కనుల పండువగా నిర్వహించారు. తొలుత ఆలయ ప్రాంగణంలో ఉన్న మండపంలో స్వామి, అమ్మవార్లను కొలువుదీర్చి అలంకరించారు. అనంతరం అర్చకులు, పండితులు హారతిచ్చి కల్యాణ క్రతువు ప్రారంభించారు. ముహూర్త సమయంలో జీలకర్రబెల్లం, మాంగల్యధారణ, తలంబ్రాలు వంటి కార్యక్రమాలను శాస్త్రోక్తంగా జరిపించారు. భక్తులు పాల్గొని దర్శించుకున్నారు. 

శ్రీవారి సేవా టికెట్ల రుసుముల పెంపు

ద్వారకాతిరుమల, న్యూస్‌టుడే: ద్వారకాతిరుమల శ్రీవారి సేవా టికెట్ల రుసుములను పెంచినట్లు ఆలయ ఈవో వేండ్ర త్రినాథరావు తెలిపారు. సుప్రభాత సేవా టికెట్‌ రుసుము రూ.200 నుంచి రూ.300, అష్టోత్తరం శతనామార్చన రూ.300 నుంచి రూ.500, దీపారాధన సేవ రూ.10 నుంచి రూ.20లకు పెంచినట్లు పేర్కొన్నారు. ఈ నెల 10 నుంచి పెంచిన ధరలు అమల్లోకి వస్తాయని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని