logo

వైకాపా తెచ్చిన ‘ల్యాండ్‌ టైటిలింగ్‌’ అమలైతే సామాన్యులకు తీవ్ర నష్టం

భూ హక్కు(ల్యాండ్‌ టైటిలింగ్‌) పేరిట వైకాపా సర్కారు తెచ్చిన చట్టం అమలులోకి వస్తే సొంత భూములపై హక్కు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని భీమవరం బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎంవీ రమణరావు స్పష్టం చేశారు.

Published : 04 May 2024 04:12 IST

సొంత భూములపై హక్కు కోల్పేయే పరిస్థితి
భీమవరం బార్‌ అసోసేయేషన్‌ అధ్యక్షుడి వెల్లడి

మాట్లాడుతున్న రమణరావు, వేదికపై రఘురామకృష్ణరాజు, అంజిబాబు, రామరాజు

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: భూ హక్కు(ల్యాండ్‌ టైటిలింగ్‌) పేరిట వైకాపా సర్కారు తెచ్చిన చట్టం అమలులోకి వస్తే సొంత భూములపై హక్కు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని భీమవరం బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎంవీ రమణరావు స్పష్టం చేశారు. భీమవరంలో శుక్రవారం జరిగిన న్యాయవాదుల ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇలాంటి చట్టాలు అమలులోకి వస్తే ఎదురయ్యే ఇబ్బందులపై ప్రజలకు గత కొన్ని నెలలుగా అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ చట్టాన్ని జనసేన, తెదేపా నాయకులు వ్యతిరేకించడం అభినందనీయమన్నారు. అనంతరం తెదేపా, జనసేన, భాజపా కూటమి నాయకులు మాట్లాడారు.

  • ప్రజల భూములను లాక్కునేందుకు ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం తీసుకొచ్చారని.. దీన్ని కూటమి ప్రభుత్వం రద్దు చేస్తుందని జనసేన భీమవరం అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు పేర్కొన్నారు.  న్యాయవ్యవస్థ, చట్టాలు, రాజ్యాంగంపై జగన్‌కు గౌరవం లేదని తెదేపా ఉండి నియోజకవర్గ అభ్యర్థి, నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు.
  • భాజపా నరసాపురం ఎంపీ భాజపా ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ మాట్లాడుతూ ప్రజలంతా కలిసికట్టుగా సైకో జగన్‌ను తరిమికొట్టాలన్నారు. 
  • జనసేన జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు మాట్లాడుతూ మళ్లీ జగన్‌ అధికారంలోకి వస్తే న్యాయదేవత చిత్రం తీసేసి జగన్‌ ఫొటో పెట్టే పరిస్థితి వస్తుందన్నారు. ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు తదితరులు పాల్గొన్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని