logo

5 వరకు సాగునీటి విడుదల

డెల్టాలో పంట కాలువలకు మే 5వ తేదీ వరకు నీటి సరఫరా కొనసాగించాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. తాగునీటి వనరులతో పాటు ఆక్వా చెరువులను యుద్ధప్రాతిపదికన నింపుకొనేందుకు ప్రత్యేకంగా ఈ అవకాశం ఇచ్చినట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు.

Published : 01 May 2024 04:47 IST

ఉండి, న్యూస్‌టుడే: డెల్టాలో పంట కాలువలకు మే 5వ తేదీ వరకు నీటి సరఫరా కొనసాగించాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. తాగునీటి వనరులతో పాటు ఆక్వా చెరువులను యుద్ధప్రాతిపదికన నింపుకొనేందుకు ప్రత్యేకంగా ఈ అవకాశం ఇచ్చినట్లు అధికారులు స్పష్టం చేస్తున్నారు.

సీలేరు జలాలే ఆధారం.. డెల్టాలో 29 మండలాలున్నాయి. ఏలూరు జిల్లాలో నాలుగు, పశ్చిమగోదావరిలో 20 మండలాల్లో తాగు, సాగునీటి అవసరాలకు గోదావరి జలాలే ఆధారం. రబీ సాగు కీలక దశలో ఉన్నప్పుడు నదిలో ప్రవాహాలు తగ్గిపోగా సీలేరు నుంచి 3,100 క్యూసెక్కులు సరఫరా చేశారు. ఈ జలాలను సర్దుబాటు చేయడం యంత్రాంగానికి కత్తి మీద సాములా మారింది. చెరువులకు స్వచ్ఛమైన నీరందని పరిస్థితులు వెంటాడాయి. వారం నుంచి సాగునీటి అవసరాలు పరిమితం కావడంతో ప్రత్యేకంగా చెరువులు నింపేందుకు ప్రాధాన్యత ఇస్తున్నారు. డెల్టాలో 11 ప్రధాన కాలువలకు 3,350 క్యూసెక్కుల నీరొదులుతున్నారు. అన్నిచోట్లా చెరువులను నూరుశాతం నింపుకోవాలని జలవనరులశాఖ ఈఈ ఇంజినీర్‌ దక్షిణామూర్తి సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని