logo

పాలకుల నిర్లక్ష్యం... ప్రజలకు శాపం

పురపాలక హోదా కల్గి పద్దెనిమిదేళ్లు కావస్తున్నా ఇంకా బద్వేలులో పలువార్డులు కనీస సౌకర్యాలకు నోచుకోలేదు. మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Published : 20 Apr 2024 04:11 IST

వసతులకు దూరంగా బద్వేలు వీధులు
రహదారులు వేయక ఇబ్బందులు
న్యూస్‌టుడే, బద్వేలు, గోపవరం

పురపాలక హోదా కల్గి పద్దెనిమిదేళ్లు కావస్తున్నా ఇంకా బద్వేలులో పలువార్డులు కనీస సౌకర్యాలకు నోచుకోలేదు. మౌలిక సదుపాయాలు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రెండో వార్డులోని లక్ష్మీపాళెం, శీలంవారిపల్లె, రూపారాంపేట, బుచ్చిరెడ్డిపాళెం ప్రాంతాల్లో సరైన రహదారులు లేవు. రాకపోకలను సాగించాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అనేక పర్యాయాలు రహదారులు నిర్మించాలని పాలకులకు అధికారులకు విన్నవించినా స్పందన లేదు. కొన్ని వీధుల్లో రహదారులు లేకపోగా మరికొన్ని చోట్ల  లోగడ వేసినవి పాడయ్యాయి. మురుగు కాలువల్లో వ్యర్థాలు చేరి పూడికతో నిండాయి. సకాలంలో తొలగించకపోవడంతో దోమలు వ్యాప్తి చెందుతున్నాయి. ప్రమాదకమైన డెంగీ, మలేరియా లాంటి రోగాలు ప్రబలుతున్నాయి. పన్నుల రూపంలో వేలాది రూపాయలు ముక్కుపిండి వసూలు చేయడమేకానీ.. వసతుల కల్పనకు పాలకవర్గాలు చర్యలు తీసుకోవడంలేదు. వార్డులోని సమస్యలను కౌన్సిలర్లకు తెలిపినా పరిష్కారానికి నోచుకోవడంలేదని ప్రజలు వాపోతున్నారు.


రహదారి వేయలేదు

- దుర్గమ్మ, స్థానికురాలు, రూపారంపేట

అనేక పర్యాయాలు సీసీ రోడ్డు వేయమని పాలకులకు అధికారులకు తెలిపాం. స్పందనలేదు. వర్షం వచ్చిందంటే నీరు నిలిచి రాకపోకలకు కష్టంగా ఉంది. అధికారులు ఇప్పటికైనా స్సందించి సీసీ రహదారిని వేయాలి.


మురుగు కాల్వలు నిండాయి

- సుబ్బమ్మ, స్థానికురాలు

మా వీధిలో మురుగు కాల్వలు నిండాయి. మురుగునీరు ఎక్కడిక్కడ నిలిచింది. దోమలు వ్యాప్తి చెంది రేయింబవళ్లు నిద్ర  ఉండటంలేదు.అధికారులకు తెలిపినా స్పందనలేదు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని