logo

పడకేసిన ప్రగతి... జగన్‌ పాలనలో అథోగతి

పురపాలక ఆరో వార్డులోని కొత్తకొట్టాలు, వాసవీనగర్‌లో సమస్యలు వేధిస్తున్నాయి. ప్రధానంగా కొత్తకొట్టాలు, చిన్నమసీదు వీధుల మధ్య ప్రవహించే ఎర్రచెరువు అలుగువంక స్థానికులకు మురుగుకాలువగా ఉపయోగపడుతోంది.

Published : 24 Apr 2024 02:54 IST

మురుగుకంపుతో ప్రజల అవస్థలు

కొత్తకొట్టాలు వద్ద ఎర్రచెరువు అలుగులవంకలో పేరుకున్న వ్యర్థాలు

న్యూస్‌టుడే, మైదుకూరు: పురపాలక ఆరో వార్డులోని కొత్తకొట్టాలు, వాసవీనగర్‌లో సమస్యలు వేధిస్తున్నాయి. ప్రధానంగా కొత్తకొట్టాలు, చిన్నమసీదు వీధుల మధ్య ప్రవహించే ఎర్రచెరువు అలుగువంక స్థానికులకు మురుగుకాలువగా ఉపయోగపడుతోంది. వంక ఆధునికీకరించినా పూడికతీత చేపట్టలేదు. అందులో పెద్దఎత్తున వ్యర్థాలు చేరాయి. చెట్ల కొమ్మలు విరిగి వంకపై వాలిపోయాయి. శ్రీరాంనగర్‌ వరకు వంక కొనసాగుతున్న వంకలో ఏళ్లు గడుస్తున్నా పూడికతీత చేపట్టలేదు. భారీ వర్షాలు నమోదైతే లోతట్టు ప్రాంతంలోకి వరదనీరు ప్రవేశిస్తోంది. చిన్నమసీదు వీధిలో పరిసరాలు అధ్వానంగా మారుతున్నాయి. మురుగుకాలువల సమస్య వెంటాడుతోంది. కొత్తకొట్టాలు చివరిభాగంలోని ఎగువ భాగంలో మురుగుకాలువలో పూడిక పేరుకుపోతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. దుర్వాసన భరించలేక స్థానికులే డబ్బులు ఖర్చు పెట్టుకుని బాగు చేయించుకుంటున్నారు.


పూడిక తీసిందేలేదు
- మాబుచాన్‌, కొత్తకొట్టాలు

వంకకు సిమెంట్‌ గోడలు కట్టి 15ఏళ్లు అవుతోంది.  ఒకసారి కూడా పూడిక తీయలేదు. వర్షాలొచ్చినపుడు చెరువునీళ్లు వస్తే  వంకలో ఉండేటివి కొట్టుకొని పోవాల్సిందే. గాలి తోలినపుడు వాసన వస్తా ఉంటాది. ఇళ్ల మధ్యనే పందులు తిరుగుతా ఉంటాయి. మురుగుకాలువలు, వంకలను శుభ్రం చేస్తా ఉంటే పందులు రాకుండా ఉంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని